The India House: పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్… హీరో అఖిల్ కాదు నిఖిల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, విక్రమ్ రెడ్డి కలిసి స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌజ్ ‘వీ మెగా పిక్చర్స్’… అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి ఒక సినిమా చేస్తున్నాం అనే అనౌన్స్మెంట్ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వైరల్ అవుతూనే ఉంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో హీరోగా ఎవరు నటిస్తారు అనే డిస్కషన్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో కూడా భారీగానే జరిగింది. కొంతమంది మాత్రం చరణ్ కి అఖిల్ మంచి ఫ్రెండ్ కాబట్టి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అఖిల్ హీరోగా ఉంటాడు అనుకున్నారు. ఆల్మోస్ట్ ఇదే వార్త అందరి నుంచి వినిపించింది, అలా అనుకున్న వాళ్లందరికీ షాక్ ఇచ్చారు ప్రొడ్యూసర్స్. ‘ది ఇండియా హౌజ్’ అనే టైటిల్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన చరణ్, విక్రమ్, అభిషేక్ అగర్వాల్… ఈ సినిమాలో హీరోగా నిఖిల్ ని ఫైనల్ చేసారు. కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ కి అభిషేక్ అగర్వాల్ కి మంచి రిలేషన్ ఏర్పడింది. నిఖిల్ కి నార్త్ లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇలాంటి సమయంలో అభిషేక్ అగర్వాల్, నిఖిల్ లకి చరణ్-విక్రమ్ లు కూడా కలవడం ‘ది ఇండియా హౌజ్’ ప్రాజెక్ట్ రేంజ్ ని పెంచే విషయమే. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ గారి 140 జయంతి సందర్భంగా… ఆయన జీవితంపైన ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. రామ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నిఖిల్, శివ అనే పాత్రలో నటిస్తుండగా అనుపమ్ ఖేర్ ఇంపార్టెంట్ పాత్రలో నటిస్తుండడం విశేషం.
‘ఇండియా హౌజ్’ అనేది ఫిక్షనల్ కథ కాదు.. “1905 – 1910 మధ్య కాలంలో ఉత్తర లండన్‌లో, హైగేట్ లోని క్రోమ్‌వెల్ అవెన్యూలో ఉన్న విద్యార్థి వసతి భవనం. న్యాయవాది శ్యామ్‌జీ కృష్ణ వర్మ ప్రోత్సాహంతో, బ్రిటన్‌లోని భారతీయ విద్యార్థులలో జాతీయవాద భావాలను పురికొల్పడానికి దీన్ని ప్రారంభించారు. ఈ సంస్థ ఇంగ్లండ్‌లో ఉన్నత చదువుల కోసం వచ్చే భారతీయ యువకులకు స్కాలర్‌షిప్‌లను మంజూరు చేసేది. ఈ భవనం వేగంగా రాజకీయ క్రియాశీలతకు కేంద్రంగా మారింది. ఇది విదేశీ విప్లవ భారత జాతీయవాదానికి అత్యంత ప్రముఖమైనది. వివిధ సమయాల్లో భవనాన్ని ఉపయోగించిన జాతీయవాద సంస్థలను అనధికారికంగా సూచించడానికి “ఇండియా హౌస్” అనే పేరే వాడేవారు. “ది ఇండియన్ సోషియాలజిస్ట్” అనే పత్రికని ఈ హౌజ్ నుంచి నడిపే వారు. శ్యామ్‌జీ కృష్ణవర్మ నిష్క్రమణ తర్వాత, సంస్థకు వినాయక్ దామోదర్ సావర్కర్ కొత్త నాయకుడయ్యాడు. సావర్కర్ కథని లింక్ చేస్తూనే ‘ది ఇండియా హౌజ్’ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవ్వనుంది.
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
On the occasion of the 140th birth anniversary of our great freedom fighter Veer Savarkar Garu we are proud to announce our pan India film – THE INDIA HOUSE
headlined by Nikhil Siddhartha, Anupam Kher ji & director Ram Vamsi Krishna!
Jai Hind!@actor_Nikhil @AnupamPKher… pic.twitter.com/YYOTOjmgkV— Ram Charan (@AlwaysRamCharan) May 28, 2023
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?