బిగ్ స్క్రీన్ హంగామా మొదలైన రెండు వారాలు అవుతున్న ప్రేక్షకులు ఇంకా పూర్తిస్థాయిలో థియేటర్ల బాట పట్టలేకపోతున్నారు. తెలంగాణలో వంద శాతం ఆక్యుపెన్సీతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్సులు ఓపెన్ అయ్యాయి. ఏపీలోనూ దాదాపుగా అన్ని పర్మిషన్స్ ఉన్న కొన్ని చోట్ల థియేటర్స్ ఓపెన్ కానీ పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు లేకున్నాను, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు థియేటర్లో నడుస్తున్న ప్రేక్షకులు థియేటర్ల వైపు చూడలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఇప్పటివరకు విడుదలైన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చిన మంచి వసూళ్లను రాబట్టుకోలేకపోతున్నాయి. అయితే, ఇప్పుడు ఈ భయం పాన్ ఇండియా సినిమాలకు కూడా పట్టుకోంది.
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు కరోనా కారణంగా ఆలస్యం అయినా విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్మాతలకు గుబులు మొదలైన ఆయా సినిమాల దర్శకులపై నమ్మకం, ఆపై ఈ సినిమాల కోసం అభిమానుల ఎదురుచూపుల వల్ల నిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి, ప్రేక్షకుల మూడ్ చూస్తోంటే నిర్మాతల్లో మరోసారి ఆందోళన మొదలవుతోంది. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలతో నిర్మాతల్లో మరింత టెన్షన్ మొదలైంది.
మరో పరేషాన్ చేసే ముచ్చట ఏంటంటే, ఆయా సినిమాల విడుదల తేదీలకు కూడా మరో పాన్ ఇండియా సినిమాలే పోటీలో ఉండటంతో ఏమి చేయాలనీ పరిస్థితి కనిపిస్తోంది. మరికొందరి వాదన ఏంటంటే ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించేంత గొప్ప సినిమాలు ఏమి రాలేదనేది వారి భావన. ప్రస్తుతం ఓటీటీలకు వెళ్లే సినిమాలను అడ్డుకోవాల్సింది పోయి, బడా సినిమాలు కూడా ఆ బాటలోకి వెళ్లోద్దని నిర్మాతల్లో ఒకరు సూచించారు. ప్రేక్షకునికి సినిమాల విషయంలో ఎంత కష్టంగా వున్నా మొదటి ప్రియారిటీ థియేటరే కానీ, ఓటీటీ కాదని ఆ నిర్మాత చెప్పుకొచ్చారు.