Pallavi Prashanth Releases a Video amid Absconding News: బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా ఉన్న పల్లవి ప్రశాంత్ మీద పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అతన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి పంపించి వేసిన తరువాత మళ్ళీ వెనక్కు తీసుకువెళ్లిన ఇద్దరు డ్రైవర్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళితే అక్కడ లేడని పరారీలో ఉన్నాడని మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం మీద స్పందిస్తూ ప్రశాంత్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. సదరు వీడియోలో ప్రశాంత్ మాట్లాడుతూ… అన్నా నేను ఎక్కడికి పోలే, ఇవి అన్నీ తప్పుడు సమాచారాలు, నేను ఇంటికాడనే ఉన్నాను అంటూ తన ఇంటిని కూడా వీడియోలో చూపించాడు. ఇక ఆ తర్వాత గ్రామస్థుల దగ్గరకు వెళ్లి వాళ్లతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేశాడు.
Rishab Shetty : సొంత ఊరు కోసం రుణం తీర్చుకున్న కాంతార హీరో.. ఏం చేశాడంటే?
వాళ్లంతా ప్రశాంత్ ఇక్కడే ఉన్నాడు అని చెప్పుకొచ్చారు, ఆ తర్వాత ప్రశాంత్ ఒక అయ్యప్ప మాలధారుడి వద్దకు వెళ్లి మాట్లాడించగా ఆ వ్యక్తి మాట్లాడుతూ నిన్న రాత్రి పడి పూజ ఉండగా రమ్మన్నా రాలేదని, అందుకే నేను ఈ ఉదయం ఈ ఇంటికి వచ్చానని అన్నాడు. అక్కడి గ్రామస్థులతో కూడా మాట్లాడించగా వారంతా ప్రశాంత్ ఎక్కడికి పోలేదు, తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేయొద్దు అంటూ కోరారు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ మాట్లాడుతూ… నేను ఎక్కడికి పోలేదు, ఇంట్లోనే ఉన్నాను, నా వల్ల ఇబ్బంది కలిగితే క్షమించండి అని అన్నాడు. నేనేమీ తప్పు చేయలేదు, నా ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని నేను ఆ ఫోన్ చూడలేదు, నేను వేరే ఫోన్ లో లాగిన్ చేసి చూస్తున్నాను అని అన్నాడు. అందరూ కలిసి టెన్షన్ పెడుతున్నారు అంటూ ప్రశాంత్ వెల్లడించారు. ఇక మళ్ళీ జై జవాన్ జై కిసాన్.. మల్లొచ్చినా అంటే తగ్గేదేలే అంటూ తన మేనరిజం చేసి చూపించాడు పల్లవి ప్రశాంత్.