‘ప్రతిరోజు పండగే’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా బన్నీ వాసు నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ మూవీ నిర్మితమౌతోంది. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి ‘భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే’ వంటి సూపర్ హిట్స్ అందించారు. ఇప్పటికే విడుదలైన ‘పక్కా కమర్షియల్’ టీజర్ కు చక్కని స్పందన వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ కు ఎక్స్ టార్డినరీ రెస్పాన్స్ లభించింది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమాలోని అందాల రాశీ పాట జూన్ 1న విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారని, అతని కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తారని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ‘ప్రతి రోజు పండగే’ సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని, అలానే రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోందని వాసు చెప్పారు. ఎస్కెఎన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.