టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్, నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి కాంబోలో రూపొందుతున్న చిత్రం “పాగల్”. అవికా గోర్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనిని దిల్ రాజు సహకారంతో పివిపి సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రధన్ సంగీతం అందిస్తున్న “పాగల్”కు మణికందన్ సినిమాటోగ్రఫీ విభాగాన్ని నిర్వహిస్తుండగా, గ్యారీ జిహెచ్ ఎడిటర్. తమిళ హిట్ చిత్రం “ఓహ్ మై కడవులే” చిత్రానికి రీమేక్ గా “పాగల్” రూపొందుతోంది. ఈ రొమాంటిక్ లవ్ డ్రామా ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Read Also : మహేష్ బాబు బర్త్ డే సీడీపీ… సెలెబ్రేషన్స్ షురూ
ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో విశ్వక్ సేన్ సరికొత్త స్టైలిష్ లుక్ లో కన్పించి టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు. “పాగల్” నిర్మాతలు ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. తాజాగా “పాగల్” నుండి టైటిల్ వీడియో సాంగ్ ను ఈరోజు విడుదల చేశారు. రామ్ మిర్యాల ఈ సాంగ్ ను పాడగా, మామా సింగ్ ర్యాప్ ను అందించారు. చంద్రబోస్ లిరిక్స్ ఇచ్చారు. యూత్ ఫుల్ గా ఉన్న ఈ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.