ఓటీటీలోకి రోజుకు ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి.. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా విడుదల అవుతుంటాయి.. తాజాగా మరో యాక్షన్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. కన్నడ బ్లాక్ బాస్టర్ మూవీ కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ నటించిన యాక్షన్ డ్రామా మూవీ యువరాజ్ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లను స్కిప్ చేస్తూ ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది.. యాక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తుంది.
యువ సినిమాతో రాజ్‌కుమార్ కాంపౌండ్ నుంచి యువరాజ్‌కుమార్ హీరోగా సాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ అన్నయ్య అయిన రాఘవేంద్ర రాజ్‌కుమార్ కొడుకే ఇతను.. ఈ సినిమాను కన్నడంలో హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసింది. ఇక సంతోష్ ఆనంద్‌రామ్ దర్శకత్వం వహించాడు… మార్చి 29 న కన్నడలో థియేటర్లలోకి వచ్చింది.. నెలకు మిగిలిన భాషల్లో ఓటీటీలోకి వచ్చేసింది..
అక్కడ కమెర్షియల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. యువ కన్నడ వెర్షన్ ఏప్రిల్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో మాత్రం నెల రోజుల ఆలస్యంగా మే 17న ఓటీటీలో వచ్చేసింది.. సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఇక్కడ కూడా దూసుకుపోతుందని తెలుస్తుంది. కాంతార తర్వాత కన్నడంలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించిన మూవీ ఇది.నితిన్ తమ్ముడు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది..