థియేటర్ల లోకి విడుదలయ్యే సినిమాలకన్నా ఓటీటిలో విడుదయ్యే సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.. ఆ సినిమాలే బాగా పాపులర్ అవుతున్నాయి.. ఇప్పుడు తాజాగా ఓటీటిలోకి మరో కొత్త మూవీ వచ్చేసింది.. ఎప్పుడో మొదలైన మూవీ ఇన్నాళ్లకు ఇక్కడ రిలీజ్ అయ్యింది.. థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత ఎలాండి హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అయిపోతుంది. కొత్త కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చెయ్యబోతుంది.. ఈ సినిమా కథ ఏంటో ఒకసారి చూద్దాం..
మహాభారతం నుంచి స్ఫూర్తిగా తీసిన తెలుగు సినిమా ‘కృష్ణఘట్టం’. చైతన్యకృష్ణ, వెంకటకృష్ణ గోవడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబరు 3న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే కంటెంట్ సరిగా తీయకపోవడం వల్ల జనాలకు పెద్దగా ఎక్కలేదు. కథ ఎంపిక బాగున్నప్పటికీ ప్రజెంట్ చెయ్యడంలో డైరెక్టర్ విఫలం అయ్యాడు.. దాంతో సినిమా జనాలకు రీచ్ అవ్వలేక పోయింది.. స్టేజీ నాటకాలు వేసే ఓ బ్యాంక్ ఉద్యోగి, అల్లరిచిల్లరగా తిరిగే కుర్రాడు జీవితాల్లో ఎలాంటి సంఘటనలు జరిగాయనేదే అస్సలు కథ..
ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు పాత్రకు న్యాయం చేశారు..సినిమాలో నాటకాలు, దానికి సంబంధించిన స్టోరీ, సన్నివేశాల్ని చెప్పారు. అందువల్ల ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. ఇకపోతే నవంబరులో థియేటర్లలో రిలీజైన ఈచిత్రం.. దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.. కొత్త సినిమా కోసం వెయిట్ చేసే వాళ్లు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి.. ఇక ఈరోజు ఓటీటీలో ఎక్కువ సినిమాలే విడుదల కాబోతున్నాయి…