Ram Charan: గేమ్ ఛేంజర్ షూటింగ్ లో అసలు సెక్యూరిటీ లేరా? ఈ లీకులేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీ షూటింగ్ ఏ టైం లో స్టార్ట్ అయ్యిందో తెలియదు కానీ అప్పటినుంచి ఇప్పటివరకూ… అఫీషియల్ గా ప్రొడ్యూసర్స్ కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో లీకుల రూపంలో దొరుకుతుంది. చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఏ పార్టీ పెట్టాడు, ఎలా కనిపించబోతున్నాడు, శ్రీకాంత్ క్యారెక్టర్ రివీల్, రాజీవ్ కనకాల రివీల్, ఎలాంటి సెట్స్ వాడారు లాంటి విషయాలని షూటింగ్ స్పాట్ నుంచి ఎప్పుడో లీక్ చేసేశారు. లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్ షూటింగ్ అలా స్టార్ట్ అయ్యిందో లేదో ఇలా లీక్ ఇచ్చేసారు. గేమ్ ఛేంజర్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది, ఈ షూటింగ్ స్పాట్ నుంచి పరిగెడుతున్న గుర్రాలు ఉన్న క్లిప్ తో పాటు చరణ్, కియారా ఫోటోలని కూడా లీక్ చేసారు. వందల కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాకి కొంచెం సెక్యూరిటీ పెట్టుకోలేకపోతున్నారో లేక చిత్ర యూనిట్ లోని కొందరు కావాలనే లీక్ చేస్తున్నారో తెలియదు కానీ ఇలానే ఇంకొన్ని రోజులు పోతే మొత్తం సినిమానే బిట్స్ అండ్ పీసెస్ గా ఆన్ లైన్ లో పెట్టేలా ఉన్నారు.
దిల్ రాజు అండ్ టీమ్ ఇమ్మిడియట్ గా ఈ లీకులని ఆపకపోతే సినిమాకి చాలా నష్టం వచ్చే ప్రమాదం ఉంది. చరణ్-శంకర్ లు పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టాలి అని కష్టపడి చేస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ స్పాట్ నుంచి ఫోటోస్ లీక్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు గతంలో వైజాగ్, రాజమండ్రి షెడ్యూల్స్ నుంచి కూడా ఇలానే ఫాన్స్ షూటింగ్ చూడడానికి వెళ్లి చరణ్ లుక్ ని లీక్ చేశారు. శంకర్ సినిమాలో సోషల్ ఎలిమెంట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకే చరణ్, విలేజ్ లుక్ అండ్ కాలేజ్ స్టూడెంట్ లుక్… ఇలా రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు అనే మాట బయటకి వచ్చింది కానీ ఎలాంటి రోల్ చేస్తున్నాడు అనే పూర్తిగా ఎవరికీ తెలియదు. భారతీయుడు సినిమాలో ఓల్డ్ కమల్ హాసన్ క్యారెక్టర్ రేంజులో గేమ్ ఛేంజర్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ ని డిజైన్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని అర్ధం చేసుకోని మెగా ఫ్యాన్స్ కూడా గేమ్ ఛేంజర్ సినిమా నుంచు లీకులు బయటకి రాకుండా చూసుకుంటే సినిమాకి మంచి చేసిన వాళ్లు అవుతారు.
Also Read
తాజావార్తలు
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
-
CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
-
Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..