మహానటిగా మెప్పించిన కీర్తి సురేష్ గతేడాది డిసెంబర్‌లో తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కీర్తి సినిమాలు చేస్తుందా అనే అనుమానాలు ఉండేవి. కానీ కీర్తి మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా ఆమె నటించిన ‘ఉప్పుకప్పురంబు’ సినిమా డైరెక్ట్‌గా ఓటిటిలో రిలీజ్ అయింది. ప్రస్తుతం తమిళ్‌లో కన్నివేడి, రివాల్వర్ రీటా సినిమాలతో బిజీగా ఉంది. అయితే.. కీర్తి ముందు నుంచి కూడా లిప్ లాక్ సీన్స్ చేయలేదు. ఇక పై కూడా అలాంటివి చేసే ఛాన్స్ లేదు.
బాలీవుడ్‌లో దీపిక పదుకొనే లాంటి స్టార్ హీరోయిన్లు పెళ్లైన తర్వాత రొమాన్స్, లిప్ లాక్స్, బికినీతో రెచ్చిపోయారు. కానీ కీర్తి మాత్రం అలాంటి వాటికి నో చెప్పెస్తోంది. అప్పటి వరకు గ్లామర్ గేట్స్ తెరవని కీర్తి సురేష్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా నుంచి యూ టర్న్ తీసుకుంది. ఈ సినిమాలో కాస్త డోస్ పెంచి హీట్ పెంచేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో బేబీజాన్ సినిమాలోను గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఇంతకుమించి అమ్మడు చేసిన స్కిన్ షో తక్కువే. అయితే టాలీవుడ్‌లో ఇప్పుడు కీర్తి ఒక క్రేజీ ప్రాజెక్ట్ కమిట్ అయినట్టుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ నటించనున్న ఓ కొత్త సినిమాలో ఆమె పేరు వినిపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ కోసం కీర్తి హద్దులు చెరిపేస్తుందా అనే టాక్ అయితే నడుస్తోంది. కానీ ఇంకా ఈ ప్రాజెక్ట్ కన్ఫామ్ కావాల్సి ఉంది. మరి రాబోయే సినిమాలతో అందాలా ఆరబోతకు డోస్ పెంచుతుందో లేదా తగ్గిస్తుందో చూడాలి.