Site icon NTV Telugu

OG : ఏపీలో పవన్ ఫ్యాన్స్ అలెర్ట్.. ఓజీ ప్రీమియర్స్ టైమ్ ఛేంజ్..

Og (2)

Og (2)

OG : ఏపీలో పవన్ ఫ్యాన్స్ కు అలెర్ట్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. 25న తెల్లవారు ఒంటిగంటకు ప్రీమియర్స్ కు పర్మిషన్ ఇస్తూ ఇంతకు ముందు జీవో ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తాజాగా దాన్ని మారుస్తూ మరో జీవో రిలీజ్ చేశారు. 25న తెల్లవారుజాము ఒంటిగంట నుంచి 24న రాత్రి 10 గంటలకు మార్పు చేశారు. అంటే ముందు రోజే రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్ షోలు ఏపీలో వేస్తారు.

Read Also : OG : ఆ ముగ్గురి ఆశలు పవన్ కల్యాణ్‌ మీదే..

కాబట్టి ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్న వారంతా దీన్ని గమనించాలని మూవీ టీమ్ కోరింది. ఇక OG ప్రీమియర్ షో కి రూ.1000 టికెట్ ధరను నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఓజీ ప్రీమియర్స్ కు భారీగా టికెట్లు సేల్ అయిపోయాయి. ఏపీ వ్యాప్తంగా ఫస్ట్ షోకు టికెట్లు దొరక్క పవన్ ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు. ఓజీ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వస్తోంది.

Read Also : Ranbir Kapoor: రణ్ బీర్ కపూర్ పై కేసు.. NHRC ఆదేశాలు

Exit mobile version