లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు, విశ్వనాథన్ అండ్ సన్స్ ఇరుముడి వరుస విజయాలతో తెలుగు సినిమాకు మళ్ళీ ఆశలు చిగురించాయి. థియేటర్లు కలకలలాడాయి. కానీ ఆ జోరు ఎంతో కాలం నిలవలేదు. సెప్టెంబర్‌లో వచ్చిన సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో వచ్చిన సినిమాలు కూడా పెద్దగా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. మరి ఇండస్ట్రీ ఆశలన్నీ ఈ నెల తీరుస్తుందా? ఆడియన్స్‌కి కావలసిన ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందా?
ఈ మధ్య కొన్ని సినిమాలు హిట్ కావడంతో థియేటర్ల దగ్గర మళ్ళీ సందడి కనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆ ఊపును కంటిన్యూ చేయలేకపోతున్నాయి. కంటెంట్ కంటే కాంబినేషన్, ప్రమోషన్స్ కంటే అంచనాలు ఎక్కువైపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫలితం తారుమారవుతుంది. సెప్టెంబర్ మంత్‌తో పాటు అక్టోబర్ ఫస్ట్ వీక్ ఇచ్చిన షాక్ తర్వాత, అక్టోబర్ నెలలో వచ్చే సినిమాలకు ఓపెనింగ్ మాత్రమే కాదు, పాజిటివ్ టాక్‌ను నిలబెట్టుకోవడమే అసలు సవాలుగా మారుతుంది. వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. అక్టోబర్ 9న దసరా హాలిడేస్ సీజన్‌లోకి వస్తున్న ఈ సినిమా వెంకీ స్టార్‌డమ్‌ను క్యాష్ చేసుకోవడమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు తీసుకురావాలి. లేకపోతే భారీ కాంబినేషన్ కూడా బాక్స్ ఆఫీస్‌కు సరిపోదనే మరో ఉదాహరణగా మిగిలే ప్రమాదం ఉంది.
విభిన్న కథలతో వచ్చే శ్రీవిష్ణుకు ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. కానీ ‘కామ్రేడ్ కళ్యాణ్’ దసరా రేస్‌లో నిలబడాలంటే ఎంటర్‌టైన్‌మెంట్ మెప్పించాలి. శ్రీవిష్ణు గత విజయాల స్థాయిలో మౌత్ టాక్ తెచ్చుకుంటేనే నిలబడే అవకాశం ఉంది. స్టార్ హీరో సినిమా కాకపోవడంతో మొదటి రోజు హైప్ కంటే మొదటి షో టాకే బాక్స్ ఆఫీస్‌ను నిర్ణయించే పరిస్థితి ఉంటుంది. అక్టోబర్ 9 లైనప్‌లో ఈ సినిమా కూడా ఉంది. కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, దాదాపు 400 కోట్లు కొల్లగొట్టి హిందీలో భారీ విజయాన్ని అందుకున్న ‘హనుమాన్’ ఆర్మీ ఇప్పుడు తెలుగు మార్కెట్ను టార్గెట్ చేస్తుంది. అక్టోబర్ 9న తెలుగు థియేటర్లలోకి వస్తుంది. హిందీలో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల దగ్గర అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అన్నదే అసలు పాయింట్.
అక్టోబర్ రెండవ వారంలో బాక్స్ ఆఫీస్‌ను నిలబెట్టేందుకు వరుసగా క్రేజీ సినిమాలు క్యూ కట్టాయి. ‘ట్రైలర్ టు రణబాలి’, ఆ తర్వాత ‘గర్విడి లక్ష్మి’, నెలాఖర్లో ‘కల్ట్’ ఇలా ఒక్కో సినిమా ఒక్కో జానర్‌లో వస్తుంది. వరుస ఫ్లాపులతో డల్‌గా మారిన బాక్స్ ఆఫీస్‌కు ఈ అక్టోబర్ సినిమాలైన పండుగ తీసుకొస్తాయా? రజినీకాంత్ – నెల్సన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడు అదే ప్లేస్‌లో ‘జైలర్ 2’ వస్తోంది. అక్టోబర్ 15న రిలీజ్, దసరా హాలిడేస్, భారీ కాస్ట్, అనిరుధ్ మ్యూజిక్ అన్నీ ప్లస్‌లే. కానీ ఫస్ట్ పార్ట్ మ్యూజిక్‌ను రిపీట్ చేయడమే అసలు సవాల్. కంటెంట్ లో చిన్న తేడా కొట్టినా భారీ అంచనాలే మైనస్‌గా మారే ఛాన్స్ ఉంది. అందుకే ‘జైలర్ 2’కు బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ కేవలం హిట్ కాదు, ‘జైలర్’ రేంజ్ ఇంపాక్ట్‌ను రిపీట్ చేయడమే అసలు ఛాలెంజ్.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక మధ్య జోడీ మళ్ళీ వస్తూ ఉండడంతో ‘రణబాలి’పై క్రేజ్ ఉంది. రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 16న రిలీజ్ అవుతుంది. అయితే విజయ్‌కు ఈ సినిమా సక్సెస్ కీలకం. గత ఫలితాల నేపథ్యంలో ‘రణబాలి’ హిట్‌తో తన మార్కెట్‌కు మళ్ళీ బూస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్టార్ హీరోల సినిమాల మధ్య కంటెంట్ తో వస్తోంది ‘గరివిడి లక్ష్మి’. ప్రముఖ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంది టైటిల్ రోల్‌లో నటిస్తుంది. అక్టోబర్ 17న రిలీజ్. ఇక నెలాఖరులో విశ్వక్‌సేన్ కల్ట్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ స్లాషర్ త్రిల్లర్ అక్టోబర్ 30న వస్తుంది. డార్క్ జానర్ తెలుగు ఆడియన్స్‌కు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అన్నదే ‘కల్ట్’కు కీలకం. అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా బాక్స్ ఆఫీస్‌కు రిలీఫ్ దొరుకుతుందా లేదా అన్నది ఈ సినిమాల రిజల్ట్స్‌తోనే తేలనుంది.

