Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Obsession Collections : కొన్ని సినిమాలు భారీ బడ్జెట్తో వస్తాయి. మరికొన్ని స్టార్ హీరోల హంగామాతో ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే అరుదుగా మాత్రమే కొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండానే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతాయి. ప్రస్తుతం హాలీవుడ్లో అలాంటి సంచలనమే సృష్టిస్తోంది సైకలాజికల్ హారర్ చిత్రం ‘అబ్సెషన్’. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన నాలుగు రోజుల్లోనే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసింది.
బడ్జెట్ ఏడు కోట్లు మాత్రమే
అబ్సెషన్ నిర్మాణ వ్యయం ఒక మిలియన్ డాలర్ల లోపే ఉండటం విశేషం. భారతీయ కరెన్సీలో ఇది సుమారు 7.3 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. అయితే విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 148 మిలియన్ డాలర్లకు పైగా, అంటే దాదాపు 1,200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. చిన్న సినిమా కూడా బలమైన కథ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభావం చూపగలదో అబ్సెషన్ మరోసారి నిరూపించింది.
Also Read
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
భారతీయ మార్కెట్లో కూడా ఈ సినిమా మంచి ఆదరణ పొందుతోంది. ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకింగ్ సంస్థ సాక్నిల్క్ వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు ఈ చిత్రం దేశవ్యాప్తంగా 11.52 కోట్ల రూపాయల గ్రాస్, 9.75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను నమోదు చేసింది. మే 29న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు సాధారణ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, వీకెండ్లో కలెక్షన్లు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఆదివారం భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది.
సినిమా కథ
ఈ స్టోరీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. మ్యూజిక్ స్టోర్లో పనిచేసే బేర్ అనే యువకుడు తన సహోద్యోగి నిక్కీని ప్రేమిస్తాడు. అయితే తన ప్రేమను ఆమెకు చెప్పే ధైర్యం చేయలేడు. ఇదే సమయంలో అతనికి ఒక విచిత్రమైన శక్తులు కలిగిన బొమ్మ దొరుకుతుంది. యజమాని కోరుకున్న ఒక కోరికను నెరవేర్చగల ఆ బొమ్మ సహాయంతో నిక్కీ తనను ప్రేమించాలని బేర్ కోరుకుంటాడు. అక్కడి నుంచి ప్రారంభమయ్యే సంఘటనలు వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి. ఒక కోరిక ఎలా భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో సినిమా ఉత్కంఠభరితంగా చూపిస్తుంది. ప్రేమ పేరుతో జరిగే మానసిక వేధింపులు ఎంత ప్రమాదకరమో ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపించింది. అందుకే యువతతో పాటు మహిళా ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. భయంతో పాటు ఆలోచింపజేసే అంశాలను కలిపి చూపించడంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది.
- Tags
- cinema
తాజావార్తలు
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!