NTV Film Roundup : మైసూరు వదలని చరణ్.. అమెరికాకి దేవరకొండ.. హైదారాబాద్లో మహేష్, బన్నీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTV Film Roundup: Telugu Movie Shooting Updates 2nd December 2023: ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా టాలీవుడ్ లో జరుగుతున్న షూటింగ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికి బడా సినిమాలన్నీ దాదాపుగా సెట్స్ మీదనే ఉన్నాయి. ముందుగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విషయానికి వెళ్తే ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. మహేష్ బాబు మీనాక్షి జంటగా ఈ సాంగ్ లో కనిపించబోతున్నారు.
Pushpa 2 Shooting Update: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకి సంబంధించిన షూటింగ్ ఖైరతాబాద్ ప్రాంతంలో జరుగుతోంది. అయితే ఈ సినిమాకి రెండు చోట్ల షూటింగ్ జరుగుతుందని చెబుతున్నారు. రామోజీ ఫిలిం సిటీ లో ఒక టీం షూట్ చేస్తుండగా ఖైరతాబాద్ ప్రాంతంలో మరో టీం షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ కి అనారోగ్యం ఏర్పడిన నేపథ్యంలో ఆయన షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అల్లు అర్జున్ లేని సీన్స్ ప్రస్తుతానికి షూటింగ్ జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
Devara Shooting Update: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతానికి శంషాబాద్ లో నిర్మించిన ప్రత్యేక సెట్స్ లో జరుగుతోంది. సినిమాకి సంబంధించిన చాలా కీలకమైన ఘట్టాలను ఆ ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Game Changer Shooting Update: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి మైసూర్లో జరుగుతుంది. రామ్ చరణ్ తదితరుల మీద ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు షూటింగ్ జరిగే అవకాశం ఉందని దిల్ రాజు వెల్లడించారు. అలా రేపటితో ఈ షెడ్యూల్ ముగుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Family Star Shooting Update: విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఢిల్లీలో షూటింగ్ పూర్తికాగా అమెరికా వెళ్లి అక్కడ షూట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో అమెరికాకి సినిమా యూనిట్ బయలుదేరే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
ట్రెండింగ్
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!