NTV Telugu Site icon

NTR30: అఫీషియల్ – తారక్ ఫ్యాన్స్‌కి ఒకటి గుడ్.. మరొకటి బ్యాడ్ న్యూస్

Ntr30 Official Announcement

Ntr30 Official Announcement

NTR30 Movie Makers Announced Shoot and Release Dates: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ అప్డేట్ రానే వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్ చేయబోయే ఎన్టీఆర్30 ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్లనుందో అనౌన్స్‌మెంట్ వచ్చింది. నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా.. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌గా షూటింగ్ ప్రారంభించనున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో.. ఈ క్షణం కోసం ఎదురుచూసిన తారక్ ఫ్యాన్స్ నిరీక్షణకు చెక్ పెట్టినట్టయ్యింది. కాకపోతే.. ఇదే సమయంలో మరో బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఇలా రిలీజ్ డేట్ వెల్లడించడం మంచి విషయమే కానీ.. ఈ ఏడాదిలో తారక్‌ను వెండితెరపై చూడలేమన్న అసంతృప్తి అభిమానుల్లో ఉంటుంది. తారక్ కోసం ఇప్పుడు ఫ్యాన్స్‌కి కనీసం ఏడాదిన్నర (16 నెలలు) వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా.. న్యూ ఇయర్ వేళ ఈ బిగ్ అప్డేట్ ఇచ్చినందుకు తారక్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

Harassment: హర్యానా క్రీడా శాఖ మంత్రిపై లైంగిక వేధింపుల కేసు

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో.. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందించేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే, ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్లాల్సిన సినిమా ఇంత ఆలస్యం అయ్యింది. స్క్రిప్ట్ విషయంలో కొరటాల చాలా మెరుగులు దిద్దాల్సి వచ్చింది. ఇప్పుడు ఔట్‌పుట్ అంతా పర్ఫెక్ట్‌గా వచ్చిందని తారక్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో.. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న తారక్.. తిరిగి రాగానే ఈ సినిమా పనుల్లో నిమగ్నం కానున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కాంబోలో ఈ సినిమా వస్తుండటం.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎంపికైనట్టు సమాచారం. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు.

Cool Drinks: కూల్‌డ్రింక్స్ తెగ తాగుతున్నారా.. ఈ తిప్పలు తప్పవు.. తస్మాత్ జాగ్రత్త!

Show comments