Pawan Kalyan: హీరోల మధ్య ఫ్యాన్ వార్స్ ఉండడం సాధారణమే.. ఏ ఇండస్ట్రీలోనైనా ఈ వార్ ఖచ్చితంగా నడుస్తూనే ఉంటుంది. మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ ఒకరికొకరు కొట్టుకొనే రేంజ్ కు వెళ్ళిపోతారు అభిమానులు .. మేము మేము బాగానే ఉంటాం.. మీరు కూడా బావుండాలి అని హీరోలు ఎంత చెప్పినా కొంతమంది హీరోల ఫ్యాన్స్ అస్సలు వినిపించుకోరు. ఇక ఈ సోషల్ మీడియా వచ్చాకా ఈ ఫాన్స్ వార్ కు హద్దే లేకుండా పోయింది. మొన్నటివరకు అల్లు అర్జున్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో రచ్చ లేపారు. ఇక ఇప్పుడు చరణ్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొదలుపెట్టారు. ఆర్ఆర్ఆర్ మొదలయిన దగ్గర నుంచి ఈ వార్ నడుస్తూనే ఉంది. తమ్ హీరో పాత్రకు అన్యాయం చేశారు అంటే.. తమ హీరో పాత్రకు అన్యాయం చేశారంటూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక తాజగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అవార్డ్స్ విషయంలో మరోసారి వీరిద్దరి ఫ్యాన్స్ కు పడింది. అమెరికాలో చరణ్ అవార్డు తీసుకోవడం.. ఎన్టీఆర్ తీసుకోకపోవడంతో చరణ్ ఫ్యాన్స్ మా హీరో గొప్ప అంటూ చెప్పుకొస్తున్నారు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ కోసం ఆస్కార్ ఎదురుచూస్తుంది అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.
Anshu Ambani: ‘మన్మథుడు’ బ్యూటీ ఏంటి ఇలా మారిపోయింది.. గుర్తుపట్టలేమే
ఇక ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఇందులో పవన్ కళ్యాణ్ ఇరుక్కున్నాడు. అదేలా అంటే.. నిన్న పవన్.. చరణ్ అవార్డు అందుకోవడంతో అబ్బాయ్ పై ప్రశంసలు కురిపిస్తూ బాబాయ్ ఒక ప్రకటన రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. చరణ్ కు అభినందనలు.. చిత్ర బృందానికి, రాజమౌళికి అభినందనలు అని చెప్పాడు కానీ, ఎన్టీఆర్ పేరును ప్రస్తావించలేదు. మొన్నటికి మొన్న చిరంజీవి సైతం తన కొడుకు గురించి చెప్పుకొచ్చాడు కానీ తారక్ గురించి మాట్లాడలేదు.. దీంతో పవన్ రాజకీయాన్ని ఇందులోకి లాగారు.. నీ అన్న కొడుకు కాబట్టే కదా చరణ్ ను పొగిడావ్.. నువ్వు కూడా కుటుంబం గురించే ఆలోచించావ్.. ప్రజలందరి గురించి ఆలోచించేవాడివైతే ఎన్టీఆర్ ను కూడా నీ కొడుకులానే భావించి అతడి గురించి కూడా మాట్లాడేవాడివే కదా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. ఇంకోపక్క చరణ్ ఫాన్స్. నందమూరి హీరోలు తారక్ గురించి అన్న మాటల పాట వీడియోలను ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్విట్టర్ వార్ నెట్టింట వైరల్ గా మారింది.