NTR Vardhanthi at Film Nagar : నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఫిలింనగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ , నందమూరి మోహన రూప, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ , తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్న కుమార్ , ఎఫ్ ఎన్ సి సి సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి అలాగే ఎక్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ మరణం లేని మహా నాయకుడు నందమూరి తారక రామారావు సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగొంది అలాగే సినీ పరిశ్రమలోనూ, రాజకీయాల్లోనూ ఎదురులేని మనిషిగా నిలబడిన వ్యక్తి. ఆయన భౌతికంగా మనకు దూరమై 28 ఏళ్లు గడిచిన ఆయన్ని ఇలా సత్కరించుకోవడం ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయం అన్నారు. నందమూరి మోహన కృష్ణ మాట్లాడుతూ మరణం లేని తెలుగు జాతి గౌరవం మా నాన్న నందమూరి తారక రామారావు. భౌతికంగా మా నుండి దూరమై 28 ఏళ్లు గడిచిన మనసా – ఆలోచనల్లోనూ, వాచా – మా మాటల్లోనూ, కర్మణా – మా చేతల్లోనూ మాతోనే ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు.
Manchu Manoj: ‘హనుమాన్’తో 28 ఏళ్లకే రెండు జనరేషన్స్ కవర్ చేశావ్.. ఇరగ్గొట్టేశావ్ తమ్ముడూ !
ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు పెను సంచలనం, సినిమాల్లో గాని, రాజకీయాల్లో గాని ఎన్టీఆర్ అనే పేరు చెరగని ముద్ర వేసుకుంది. సినిమాల్లో ఆయన వేయని పాత్ర అంటూ ఏదీ లేదు. కథానాయకుడు గానే కాకుండా ప్రతి నాయకుడు పాత్రల్లో కూడా నటించి మెప్పించిన వ్యక్తి ఎన్టీఆర్ . భగవంతుడిగా ఉన్నత క్యారెక్టర్లు నటించారు డీగ్లామరైజ్డ్ రోల్ కుష్టు వ్యాధి వచ్చిన వ్యక్తిగా రాజు పేదలో నటించారు. రాజకీయాల్లోపరంగా కూడా పెను మార్పులు తీసుకొచ్చారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల వ్యవధిలోనే ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ గారె ఆద్యుడు. ఆయన ఎప్పుడూ అందరివాడే. ఈరోజు అన్ని పార్టీలు కూడా ఆయన పేరుని ఆయన సంక్షేమ పథకాలను వాడుకుంటున్నాయి. ఆయన ఎప్పుడూ అజాతశత్రువే. దైవం మనుష్య రూపేణా అన్నట్టు ఎన్టీఆర్ మనుషులలో దైవం అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ , నందమూరి మోహన్ రూప , ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ , ఎఫ్ ఎన్ సి సి సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి , తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్న కుమార్ , భాస్కర్ నాయుడు మరియు కాజా సూర్యనారాయణ పాల్గొన్నారు.