ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే కనిపిస్తున్నాడు. నేడు చీరి తన 37 వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం చరణ్ కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక తాజాగా చరణ్ కి ఎంతో ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపాడు తారక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఎంతగా బలపడిందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటర్వ్యూలోనూ రామ్ చరణ్, తారక్ ల మధ్య స్నేహ బంధం ఎంత గొప్పదో బయటపడుతూనే ఉంది. ఇక అంతటి గొప్ప స్నేహితుడికి ఎంతో స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు తారక్.
ఒక అరుదైన ఫోటోను షేర్ చేస్తూ ” జన్మదిన శుభాకాంక్షలు రామ్ చరణ్.. నువ్వు ఎల్లప్పుడు నా పక్కన ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. ఇక నుంచి మనం మరిన్ని జ్ఞాపకాలను కలిసి సృష్టించుకుందాం” అంటూ తెలిపారు. ఇక ఆ ఫొటోలో చరణ్ షర్ట్ బటన్స్ పెడుతూ తారక్ చిరునవ్వు చిందిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మీ స్నేహం కలకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామంటూ ఇద్దరి హీరోల అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
