Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్ట్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ గ్లోబల్ లెవల్‌కు చేరుకోగా, ‘కేజీఎఫ్’ సిరీస్‌తో ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించారు. వీరిద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం కానీ ఈ ప్రాజెక్ట్ ప్రకటించి చాలా కాలం కావస్తున్నా, షూటింగ్ విషయంలో జరుగుతున్న జాప్యంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పురోగతిపై మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ కీలక విషయాలను పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా పనులను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది (2027) ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్ర బృందం పని చేస్తోంది.
సాధారణంగా ప్రశాంత్ నీల్ తన సినిమాల విషయంలో చాలా వేగంగా ఉంటారని పేరుంది. అయినప్పటికీ ఈ సినిమా పట్టాలెక్కడానికి సమయం తీసుకోవడం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ నటించిన హిందీ మూవీ వార్ 2 రిజల్ట్, మరికొన్ని సమీకరణాల దృష్ట్యా, ప్రశాంత్ నీల్ ఈ సినిమా స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు, చేర్పులు చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, కథలో మరింత పకడ్బందీగా ఉండాలని భావించి దర్శకుడు కొంత సమయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, ఇకపై ఎలాంటి జాప్యం లేకుండా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రశాంత్ నీల్ మార్కు ఎలివేషన్లు, ఎన్టీఆర్ మాస్ పర్ఫార్మెన్స్ కలిసి బాక్సాఫీస్ దగ్గర మరోసారి రికార్డుల వేట మొదలుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
తాజావార్తలు
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!