NTRNeel : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్.. సాధ్యమయ్యే పనేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజియఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం టైగర్ ఫ్యాన్స్‌ను తట్టుకోలేకుండా చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గతకొద్ది రోజులుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తు వస్తున్న మేకర్స్ ఫైనల్‌గా ఇప్పుడు షూటింగ్‌కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్స్ పను లు చివరి దశకు చేరుకున్నాయి.
Also Read : SSRMB : ‘మహేశ్’ పాస్‌పోర్ట్ తిరిగి ఇచ్చేయనున్న రాజమౌళి.!
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. తాజాగా ఎన్టీఆర్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. దీంతో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఎన్టీఆర్-నీల్ యుద్ధానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ఇదివరకే మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ వార్ 2 కారణంగా ముందుగా అనుకున్న దానికంటే కాస్త లేట్‌గా ఈ సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నారు. ఇప్పటి నుంచి చూస్తే కేవలం 11 నెలల్లో ఎన్టీఆర్-నీల్ ఈ సినిమాను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంత తక్కువ వ్యవధిలో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయాలి. అవసరమైతే మధ్యలో ఎన్టీఆర్ వార్ 2కు ఆగష్టులో ప్రమోషన్స్ కోసం డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ సాధ్యమయ్యే పనేనా అని అంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తోంది.
తాజావార్తలు
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
-
US Strikes on Iran: ఇరాన్‌పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!