Site icon NTV Telugu

NTRNeel : ప్రశాంత్ నీల్ సినిమా షూట్ కు బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్

Ntrneel

Ntrneel

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం డ్రాగన్. గత కొన్ని నెలలుగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన మేకర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవల షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో నైట్ షెడ్యూల్‌లో జెట్ స్పీడ్ లో సాగుతోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, సీనియర్ నటుడు బిజూ మీనన్ కూడా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ షూటింగ్‌కు కాస్త బ్రేక్  ఇచ్చారు. గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ స్వల్పంగా జలుబుతో బాధపడుతున్నాడట. ఆరోగ్య సమస్య పెద్దది కాకపోయినా ఎన్టీఆర్ కాస్త అలసట గా ఉన్నాడని పూర్తి విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతోనే చిత్ర బృందం షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. అనుకోని కారణాల వలన ఇప్ప్పటికే వాయిదా పడిన ఈ సినిమా షూట్ మరోసారి బ్రేక్ పడింది. ఆయితే ఇది చిన్న బ్రేక్ మాత్రమే అని ఒకటి లేదా రెండు రోజుల్లో షూట్ తిరిగి స్టార్ట్ అవుతుందని యూనిట్ సమాచారం. ప్రశాంత్ నీల్ డ్రాగన్ ను భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. వాస్తవానికి డ్రాగన్ ను మొదట 2026 జనవరి 26న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూట్ డిలే అవడంతో 2027 కు పోస్ట్ పోన్ అయింది. మరి సంక్రాంతి కానుకా తీసుకువస్తారా లేదా సమ్మర్ లో రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. కానీ ఎప్పుడు వచ్చిన సరే ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం మాత్రం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాల టాక్.   ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Exit mobile version