యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. నెవర్ రికార్డ్స్ సెట్ చెయ్యడానికి రెడీ అయిన ఎన్టీఆర్ ఫాన్స్, సింహాద్రి రీరిలీజ్ కి ఇప్పటివరకూ వరల్డ్ లో ఎక్కడ జరగని సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ఒక సినిమాని రీరిలీజ్ చెయ్యడమే ఎక్కువ అంటే, ఆ రీరిలీజ్ సినిమాకి లిరికల్ సాంగ్స్, ట్రైలర్, పోస్టర్స్ రిలీజ్ చెయ్యడం ఇంకా ఎక్కువ. ఇప్పటివరకూ మహేశ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫాన్స్ కూడా రీరిలీజ్ సినిమాలని థియేటర్స్ లో ఎంజాయ్ చేశారు కానీ సింహాద్రి రీరిలీజ్ మాత్రం అంతకు మించి అనే రేంజులో ఏర్పాట్లు చేస్తున్నారు. అమలాపురం నుంచి అమెరిక వరకూ సింహాద్రి స్పెషల్ షో పడనున్నాయి. కేవలం ఓవర్సీస్ లోనే వంద స్క్రీన్స్ లో సింహాద్రి సినిమా రీరిలీజ్ కానుంది. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని అన్ని సెంటర్స్ లో మే 20న పడబోయే షోస్ హౌజ్ ఫుల్ అయ్యాయి. రీరిలీజ్ కి ఇంకా ఆరు రోజుల సమయం ఉండడంతో ఫాన్స్ స్పెషల్ షోస్ ని యాడ్ చేస్తూనే ఉన్నారు, థియేటర్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది.
సోషల్ మీడియాలో టికెట్స్ హంగామా జరుగుతూ ఉండగానే, సింహాద్రి రీరిలీజ్ కి ప్రీరిలీజ్ ఈవెంట్ చేస్తున్నట్లు ఎన్టీఆర్ ఫాన్స్ అనౌన్స్ చేశారు. త్వరలో సింహాద్రి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతుంది, రెడీగా ఉండండి అంటూ ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి గెస్టుగా ఎవరు వస్తారు అనేది ఇంటరెస్టింగ్ విషయమే, ఎందుకంటే ఒక రీరిలీజ్ సినిమాకి ప్రీరిలీజ్ ఈవెంట్ చెయ్యడం అంటే మాములు విషయం కాదు. ఈ ఒక్క విషయం చూస్తే చాలు సింహాద్రి రీరిలీజ్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అర్ధం చేసుకోవడానికి. ఇదే జోష్ ని ఎన్టీఆర్ ఫాన్స్ మరో వారం పాటు మైంటైన్ చేస్తే చాలు మే 20న రీరిలీజ్ ట్రెండ్ లో నాన్-సింహాద్రి రికార్డ్స్ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ.