NTR: కల్కి లీక్.. దేవర సీరియస్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు లీకుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. సినిమ రిలీజ్ కాకముందే సెట్ నుంచి కొంతమంది ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లీకులు కాకుండా మేకర్స్ ఎంత గట్టి ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడో ఒకచోట ఆ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ లీక్ అవ్వడం, వైరల్ అవ్వడం జరుగుతూనే ఉంది. ఇక ఈ మధ్యనే ప్రభాస్ నటించిన కల్కి చిత్రం నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఎంతో సర్ప్రైజింగ్ గా ఉంచిన ఆ లుక్ లీక్ అవ్వడంపై మేకర్స్ ఎంతో ఆందోళన చెందినట్లు సమాచారం. రెండేళ్లుగా ఎంతో కష్టపడి ఒక్క లీక్ కూడా లేకుండా నాగ అశ్విన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఇక అంత పగడ్బందీగా ఉన్నా కూడా ప్రభాస్ లుక్ లీక్ అవ్వడంపై మేకర్స్ ఫైర్ అయ్యి లీగల్ చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యారని సమాచారం. ఇక కల్కి లుక్ లీక్ అవ్వడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది. దీంతో దేవర చిత్రబృందం అలర్ట్ అయ్యిందని టాక్ వస్తుంది. మొదటి నుంచి కూడా ఈ సినిమాను ఒక శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నారు శివ కొరటాల, ఎన్టీఆర్. ఈ సినిమా వీరిద్దరికీ ఎంత ముఖ్యమో కూడా అందరికీ తెలిసిందే.
Nivetha Thomas: హే.. నివేథా.. ఎక్కడా కనిపించడం లేదేంటి.. ?
Also Read
ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత శివ కొరటాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం దేవర. ఇక ఇటుపక్క ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా రాజమౌళి సెంటిమెంట్ ను ఎలాగైనా బ్రేక్ చేయాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నాడు. దీంతోనే ఈ సినిమా అత్యంత అద్భుతంగా రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా నుంచి టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యేంతవరకు ఒక్క ఫోటో కూడా బయటికి రాకూడదని ఎంతో పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే దేవర షూటింగ్ స్పాట్ కు 24 క్రాఫ్ట్ కి సంబంధించిన ఏ ఒక్కరు కూడా సెల్ ఫోన్లు తీసుకు రాకూడదని ఆర్డర్స్ వేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అన్న విషయం కూడా చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారంట. అంటే ఒక విధంగా సైలెంట్ గా దేవర పని చేస్తున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా కల్కి ఎఫెక్ట్ కి దేవర ఇలా సీరియస్ అయ్యాడని తెలుస్తుంది. మరి దేవర నుంచి అప్డేట్ ఎప్పుడు వస్తుంది అనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..