NTV Telugu Site icon

Devara: టెంపుల్ సెట్ లో ‘దేవర’ సాలిడ్ ఫైట్…

Devara

Devara

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ తర్వాత కలిసి ‘దేవర’ సినిమా చేస్తున్నారు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని మాత్రమే షేక్ చేసిన ఎన్టీఆర్, కొరటాల శివ ఈసారి బాక్సాఫీస్ రిపైర్లని పాన్ ఇండియా స్థాయిలో చెయ్యడానికి రెడీ అవుతున్నారు. తన సినిమాలో మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పిన కొరటాల శివ, మే 20న దేవర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి దాన్ని నిజం చేసాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ‘దేవర’ లేటెస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ సైఫ్ అలీ ఖాన్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. సైఫ్, ఎన్టీఆర్ ల మధ్య కొరటాల శివ, హ్యూజ్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక టెంపుల్ సెట్ వేసి అక్కడ ఎన్టీఆర్-సైఫ్ అలీ ఖాన్ మధ్య సీన్స్ ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు.

ఈ టెంపుల్ సెట్ షూటింగ్ నుంచి రెండు ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ లుక్, టెంపుల్ సెట్ ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. దేవర సెట్స్ నుంచి ఫోటోలు లీక్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఎన్టీఆర్‌కు సంబందించిన కొన్ని ఆన్ లోకేషన్స్ పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇందులో ఎన్టీఆర్ కలర్ ఫుల్ డ్రెస్‌లో కనిపించాడు. ఈ ఫోటో ఇలా లీక్ అయిందో లేదో సోషల్ మీడియాను షేక్ చేసేసింది. ఈ లీకుల విషయంలో మున్ముందు మళ్లీ ఇలాంటి సీన్స్ రిపీట్ అవకుండా కొరటాల అండ్ టీమ్ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫాన్స్ కాస్త ఓపిక పడితే మేకర్స్ నుంచి అఫీషియల్ గా మంచి అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లీకుల్ని వైరల్ చేసే తమ హీరో సినిమాకే నష్టం అనే విషయం అభిమానులు తెలుసుకోవాలి.

Show comments