Devara: టెంపుల్ సెట్ లో ‘దేవర’ సాలిడ్ ఫైట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ తర్వాత కలిసి ‘దేవర’ సినిమా చేస్తున్నారు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని మాత్రమే షేక్ చేసిన ఎన్టీఆర్, కొరటాల శివ ఈసారి బాక్సాఫీస్ రిపైర్లని పాన్ ఇండియా స్థాయిలో చెయ్యడానికి రెడీ అవుతున్నారు. తన సినిమాలో మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పిన కొరటాల శివ, మే 20న దేవర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి దాన్ని నిజం చేసాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ‘దేవర’ లేటెస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ సైఫ్ అలీ ఖాన్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. సైఫ్, ఎన్టీఆర్ ల మధ్య కొరటాల శివ, హ్యూజ్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక టెంపుల్ సెట్ వేసి అక్కడ ఎన్టీఆర్-సైఫ్ అలీ ఖాన్ మధ్య సీన్స్ ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు.
ఈ టెంపుల్ సెట్ షూటింగ్ నుంచి రెండు ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ లుక్, టెంపుల్ సెట్ ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. దేవర సెట్స్ నుంచి ఫోటోలు లీక్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఎన్టీఆర్‌కు సంబందించిన కొన్ని ఆన్ లోకేషన్స్ పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇందులో ఎన్టీఆర్ కలర్ ఫుల్ డ్రెస్‌లో కనిపించాడు. ఈ ఫోటో ఇలా లీక్ అయిందో లేదో సోషల్ మీడియాను షేక్ చేసేసింది. ఈ లీకుల విషయంలో మున్ముందు మళ్లీ ఇలాంటి సీన్స్ రిపీట్ అవకుండా కొరటాల అండ్ టీమ్ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫాన్స్ కాస్త ఓపిక పడితే మేకర్స్ నుంచి అఫీషియల్ గా మంచి అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లీకుల్ని వైరల్ చేసే తమ హీరో సినిమాకే నష్టం అనే విషయం అభిమానులు తెలుసుకోవాలి.
Also Read
- Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్‌కు చిరంజీవి మెగా బర్త్‌డే విషెస్!
- Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్!
- Mirzapur: The Movie: రిలీజ్‌కు ముందే కోట్లు కొల్లగొట్టిన కలీన్ భయ్యా.. మొదటి రోజే అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్!
- 418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
తాజావార్తలు
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్‌కు చిరంజీవి మెగా బర్త్‌డే విషెస్!
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!