‘టెంపర్, బాహుబలి, ఊపిరి’ వంటి చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో అందాలు ఆరబోసిన కెనడియన్ బ్యూటీ నోరా ఫతేహీ శుక్రవారం హఠాత్తుగా ఇన్ స్టాగ్రామ్ నుండి తప్పుకునే సరికీ ఆమె అభిమానులకు ఏం జరిగిందో అర్థం కాలేదు. 36.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఇన్ స్టాగ్రామ్ నుండి ఆమె ఎందుకు క్విట్ అయ్యిందో తెలియక సతమతమయ్యారు. అయితే ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆమె తిరిగి ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యక్షం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Read Also : నాగ చైతన్య వెబ్ సిరీస్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్
ఇంతకూ జరిగింది ఏమిటంటే… శుక్రవారం ఉదయం నుండి నోరా ఫతేహీ ఇన్ స్టా గ్రామ్ అక్కౌంట్ ను ఎవరో హ్యాక్ చేయాలని ప్రయత్నించారట. దాంతో కొంత సేపు అది డీ యాక్టివేట్ అయ్యిందని, ఆ తర్వాత ఇన్ స్టా టీమ్ తిరిగి తన అక్కౌంట్ ను యాక్టివేట్ చేసిందని నోరా ఫతేహీ తెలిపింది. కరోనా నుండి కోలుకున్న తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవడం కోసం నోరా తన స్నేహితులతో కలిసి దుబాయ్ కు వెళ్ళింది. ఒక్క రోజు ముందే ఆమె అక్కడ సింహాలకు ఆహారం తినిపిస్తున్న వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో పెట్టిన కొద్ది గంటలకే నోరా ఇన్ స్టా అక్కౌంట్ డిజప్పియర్ కావడంతో ఏమైందో అర్థంకాక ఫ్యాన్స్ కంగారు పడ్డారు. జరిగిన విషయాన్ని ఆమె తెలియచేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.
