Nora Fatehi Defamation Case On Jaqueline And Media: గత కొంత కాలంగా అక్రమాస్తులు, మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీలను విచారించింది. కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో ఈ ఇద్దరు సుకేశ్ చంద్రశేఖర్ నుండి బహుమతులు అందుకున్నారని కూడా ఇడి పేర్కొంది. అయితే సుకేష్ బినామీగా తన పేరును బయటపెట్టి అనవసరంగా ఈ కేసులోకి లాగారని ఆరోపిస్తూ నోరా ఫతేహి పరువు నష్టం దావా పేరుతో కోర్టు తలుపులు తట్టింది. జాక్వెలిన్‌తో పాటు వార్తలను ప్రసారం చేసిన 15 మీడియా సంస్థలపై నోరా కేసులు పెట్టింది. జాక్విలిన్ వార్తలను వ్యాపించచేసిందన్నది నోరా ఆరోపణ. సుకేష్ నుండి గిప్ట్ లు అందుకున్నట్లు జాకీ ఇచ్చిన వాంగ్మూలం తప్పు అని నోరా తన ఫిర్యాదులో పేర్కొంది.
తను సుకేష్ ను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని, ఒకే ఒక్కసారి అతనితో ఫోన్‌లో మాత్రమే మాట్లాడినట్లు స్పష్టం చేసింది. ఇడితో పాటు ఢిల్లీ పోలీసులకు జాక్వెలిన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ నోరాను హర్ట్ చేసిందట. ఇదిలా ఉంటే నోరాతో పాటు జాక్విలిన్ కు సంబంధించిన వివరాలు వెల్లడించనప్పటికీ తమ వద్ద అన్ని రుజువులు ఉన్నాయని ఇడి చెబుతోంది. సుకేష్ భార్య లీనా తనకు ఐఫోన్, లూయిస్ విట్టన్ బ్యాగ్ బహుమతిగా ఇచ్చిందని, సినిమా ఒప్పందంలో భాగంగా సుకేష్ తన బావ బాబీ ఖాన్‌కు లగ్జరీ కారును ఇచ్చాడని నోరా చెబుతోంది. మరి ఆ బావగారితో నోరాకు ఇప్పటికే పెళ్లయిందా? అన్నది మరో ఆసక్తికరమైన అంశం. మరి ఈ అంశాలపై ఇడి ఎప్పుడు క్లారిటీ ఇస్తుంది? నోరా పరువు నష్టం దావా కేసు నిలబడుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు లభిస్తుందో చూడాలి.