‘చెప్పను బ్రదర్’ అని అల్లు అర్జున్ నోటి నుంచి వచ్చిన ఒక మాట ఎంత దుమారం లేపిందో, ప్రశాంతంగా ఐకమత్యంగా ఉండే మెగా అభిమానుల్లో ఎంత కల్లోలం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫాన్స్ అంటే చిరు ఫాన్స్, చరణ్ ఫాన్స్, సాయి ధరమ్ తేజ్ ఫాన్స్, పవన్ కళ్యాణ్ ఫాన్స్, వరుణ్ తేజ్ ఫాన్స్ కానీ అల్లు అర్జున్ ఫాన్స్ కాదు అనే స్థాయికి వెళ్లిందీ గొడవ. దీన్ని సారి చెయ్యడానికి, అందరం కలిసే ఉన్నాం అని చెప్పడానికి, చూపించడానికి మెగా హీరోలు అప్పుడప్పుడూ కలిసి కనిపిస్తూ ఉంటారు. దీంతో ఫాన్స్ మళ్లీ మా హీరోలంతా ఒకటే అనుకుంటూ ఉంటారు. అభిమానులు అలా అనుకునే లోపే కాదు కాదు అల్లు అర్జున్ వేరు మెగా హీరోలు వేరు అనిపించేలా ఒక సంఘటన జరుగుతుంది. మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టిన రోజు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నార్త్ సెలబ్రిటీల వరకూ చాలా మంది చరణ్ ని విష్ చేశారు.
అల్లు అర్జున్ మాత్రం విష్ చెయ్యలేదు, పర్సనల్ గ ఫోన్ చేసి విష్ చేసాడో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం పోస్ట్ చెయ్యలేదు. నైట్ వరకూ వెయిట్ చేసిన ఫాన్స్, అల్లు అర్జున్ నుంచి ట్వీట్ రాకపోవడంతో మరోసారి మెగా ఫ్యామిలీ వేరు అల్లు అర్జున్ వేరు అనే కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ట్వీట్ చెయ్యకపోవడం ట్విట్టర్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఫాన్స్ అందరికీ ఇదే విషయంపై చర్చ జరుగుతుంది. చరణ్ ఇంట్లో నిన్న నైట్ వరకూ బర్త్ డే పార్టీ జరిగింది. ఈ పార్టీకి ఇండస్ట్రీ వర్గాలందరూ వచ్చారు కానీ అల్లు అర్జున్ మాత్రం రాలేదు. దీంతో రాత్రి నుంచి మెగా ఫాన్స్ అల్లు అర్జున్ పై మరింత నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మెగా అల్లు హీరోల మధ్య గ్యాప్ ఎప్పుడు సెటిల్ అవుతుందో చూడాలి.