హాలీవుడ్ లో హీరోయిన్లపై లైంగిక దాడులు ఆగడం లేదు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తమను వేధించారని ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్లు బాహాటంగా చెప్పిన విషయం విదితమే. ఇక తాజాగా మరో డైరెక్టర్ గుట్టు రట్టు చేశారు ముగ్గురు మహిళలు. తమను స్టార్ డైరెక్టర్ లైంగికంగా వేధించాడని సోషల్ మీడియాలో ఏకరువు పెట్టారు. జేమ్స్ బాండ్ 25వ చిత్రంగా వచ్చింది ‘నో టైమ్ టు డై’ చిత్రానికి డైరెక్టర్ గా పనిచేసిన క్యారీ జోజీ ఫుకునాపై ముగ్గురు మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. అందులో ఒక ఆమెకు 18 ఏళ్లు ఉండడం విశేషం. ఆమె తన జీవితాన్ని క్యారీ నాశనం చేసినట్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.
“క్యారీ నన్ను గత మూడేళ్ళుగా అనుభవిస్తున్నాడు. నాకు గతిలేక అతడితో పడుకున్నాను.. నన్ను రోజూ హింసించి అతను పడక సుఖం అనుభవిస్తున్నాడు. అతనికి భయపడుతూనే సంవత్సరాలు గడిపాను. నా గురించి బయట ఎవరికి చెప్పేవాడు కాదు. ఎవరైనా అడిగితే మేనకోడలు అనో, బంధువు లేదా సోదరిగా నటించమనో చెప్పేవాడు. అతనితో మూడేళ్లు నరకం చూసిన తరువాత బయటపడ్డాను” అని చెప్పుకొచ్చింది. ఇక ఆమె బయటపడ్డాక మరో ఇద్దరు మహిళలు కూడా తమ బాధను తెలియజేశారు. క్యారీ వలన తాము కూడా ఇబ్బందులు పడ్డామని, క్యారీ డైరెక్ట్ చేసిన ఒక షోలో తాము కలిసి పనిచేశామని, ఆ సమయంలో అతడు తమను లైంగికంగా వేధించినట్లు తెలిపారు. ఒకసారి అయితే తమ ముగ్గురును ఒకేసారి బెడ్ పై శృంగారం చేయడానికి పిలిచాడని, అందుకు తాము ఒప్పుకోకపోవడంతో వదిలేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు హాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇకపోతే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు క్యారీ నోరువిప్పకపోవడం విశేషం.