ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” కోసం దర్శకుడు రాజమౌళి భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసారు. రీసెంట్‌గా అన్ని భాషల్లో ప్రెస్ మీట్‌లు పూర్తి చేసిన టీమ్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకు సిద్ధమవుతోంది. “ఆర్ఆర్ఆర్” బృందం ముంబై నుండి ప్రారంభించి దేశంలోని ప్రధాన నగరాల్లో పలు భారీ ఈవెంట్‌లను ప్లాన్ చేసింది. ఈ శుక్రవారం ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుక కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతుండగా, చరణ్, తారక్ తో పాటు చిత్రబృందం మొత్తం అక్కడికి చేరుకున్నారు. ఈ భారీ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేయనున్నారని సమాచారం. ఈ ఈవెంట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులను నిరాశలో ముంచేసింది ‘ఆర్ఆర్ఆర్’ టీం తాజాగా తీసుకున్న నిర్ణయం.
Read Also :
భారీ రేంజ్ లో జరగబోతున్న ఈ వేడుకను టీవీలో కనులారా వీక్షించొచ్చని భావిస్తున్న అభిమానుల ఆశను నిరాశ చేస్తూ లైవ్ టెలికాస్ట్ ఉండబోదని, వేడుకను ఎప్పుడు? ఎలా ప్రసారం చేస్తామనే విషయాన్నీ త్వరలోనే ప్రకటిస్తామని ‘ఆర్ఆర్ఆర్’ టీం సోషల్ మీడియాలో ప్రకటించింది. అయితే సమాచారం మేరకు ఈ వేడుకకు సంబంధించిన రైట్ ను స్టార్ ప్లస్ భారీ ధరకు కొనుగోలు చేసిందని, డిసెంబర్ 31న ఈ వేడుక సదరు ఛానల్ లో ప్రసారం కానుందని తెలుస్తోంది. కాగా ఈ వేడుకకు కేవలం 1500 మంది అభిమానులు మాత్రమే హాజరు కాబోతున్నారని సమాచారం. ఇది నిజంగా అభిమానులను నిరాశ పరిచే విషయమని చెప్పొచ్చు.
Read Also :
‘బాహుబలి’ దర్శకుడి నుండి వస్తున్న ఈ సినిమాపై నార్త్ ప్రేక్షకులు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఈ భారీ చిత్రం 2022 జనవరి 7న విడుదల కానుండగా, నార్త్ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. కాగా ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు అలియా భట్ కథానాయికగా, ఒలీవియా మోరిస్ మరో కథానాయికగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తుండగా, శ్రియ, రాజీవ్ కనకాల, సముద్రఖని తదితరులు ఈ చిత్రంలో కనిపించనున్నారు.
NO LIVE TELECAST
— RRR Movie (@RRRMovie) December 19, 2021
Of #RoarOfRRRInMumbai Event today. It will be telecasted on a later date.
We have a few more #RoarofRRR events in other cities which will be telecasted live. Details soon. https://t.co/Z8xMQ4VPD2