గత రెండు రోజుల నుండి “భీమ్లా నాయక్” చిత్రబృందం సెలెబ్రేషన్స్ లో మునిగి తేలుతోంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పవన్ కళ్యాణ్ తన టీం అందరికీ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన నిత్యా మీనన్ మాత్రం ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సహా ఎక్కడా కన్పించలేదు. అంతేకాదు సినిమా విడుదలైనప్పటి నుంచి ‘భీమ్లా నాయక్’ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. దీంతో నిత్యా సైలెన్స్ గా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Read Also : Keerthy Suresh : లవర్ వదిలేసింది… శర్వా కోసం బ్యాడ్ గా ఫీల్ అవుతున్నా…
ఆహాలో తాజాగా ప్రసారమవుతున్న “తెలుగు ఇండియన్ ఐడల్”లో నిత్యామీనన్ జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో గురించి సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్న నిత్యా ‘భీమ్లా నాయక్’ గురించి నోరు మెదపడం లేదంటే ఖచ్చితంగా డీప్ గా హర్ట్ అయ్యి ఉంటుందని అంటున్నారు. నిజానికి నిత్యామీనన్ ఇలా హర్ట్ కావడానికి కారణం దర్శకుడు త్రివిక్రమ్ అని కొందరు అంటున్నారు. ఇంతకుముందు ‘S/o సత్యమూర్తి’ మూవీలో తన పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని హామీ ఇచ్చాడని, కానీ చివరికి ఆమె చిన్న అతిధి పాత్రలో మాత్రమే కనిపించిందని అన్నారు. ఆపై త్రివిక్రమ్ ఒక అద్భుతమైన పాత్రను ఆఫర్ చేస్తానని ఆమెకు చెప్పినట్లు తెలుస్తోంది. ‘భీమ్లా నాయక్’లో కూడా మంచి ఆఫర్ ఇచ్చినప్పటికీ నిత్యా మీనన్ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండడంతో ఆమె చిన్నబుచ్చుకుందని టాక్.