Nitya Menon: టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ అభిమానులకు షాక్ ఇచ్చింది. సడెన్ గా పసిబిడ్డను ఆడిస్తూ కనిపించింది. నిజంగా చేతిలో బిడ్డతో ఆమె ఈమధ్యనే బిడ్డకు జన్మనిచ్చినట్లు కనిపిస్తోంది. ఈ మధ్యనే నిత్యా వండర్ విమెన్ అనే సిరీస్ లో నటించిన విషయం విదితమే. అంజలి మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఆ షూటింగ్ లో తీసిన వీడియోనే ఇప్పుడు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అప్పటి వీడియోనా..? లేక దానికి సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా..? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ వీడియోలో నిత్యా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో బాబును ఆడిస్తూ కనిపించింది. ఇక చుట్టూ మహిళలు తచ్చాడుతూ కనిపించారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇది షూటింగ్ కాదట.
తాజాగా నిత్యా తిరుపతి జిల్లా వరదయ్యపాలెం కాంబకం గిరిజన కాలనీలో ఉన్న దేవాలయాన్ని సందర్శించింది. అక్కడ గిరిజనులను కలిసి వారి బాగోగులను తెలుసుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే గిరిజన బిడ్డను ఎత్తుకొని ఆడించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం నిత్యా చేతిలో పలు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయని టాక్.. కోలీవుడ్ లో ధనుష్ సరసన నటించి మెప్పించిన నిత్యా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు మాత్రమే ఓకే చెప్తుందట. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప సినిమాలు ఒప్పుకోనని, డబ్బు కోసం తాను సినిమాలు చేయడం లేదని ఆమె ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తుంది. చెప్పినట్లుగానే ఈ చిన్నది ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకే సై అంటూ అభిమానుల అభిమానాన్ని చూరగొంటుంది.తిరుపతి జిల్లా వరదయ్యపాలెం కాంబకం గిరిజన కాలనీ దేవాలయం లో గిరిజన ప్రజలతో కలిసి వారి బాగోగులు తెలుసుకొని