Site icon NTV Telugu

Nithya Menon: చక్కనమ్మ చిక్కినా అందమే..

nithya menon

nithya menon

అలా మొదలైంది చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన భామ నిత్యామీనన్. విభిన్నమైన కథలను ఎంచుకొని, అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలలోనే నటిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఇటీవల అమ్మడు కొంచెం బొద్దుగా అయిన మాట వాస్తవమే. కొన్ని హెల్త్ కారణాల వలన బొద్దుగా మారిన నిత్యా తన మునుపటి రూపం కోసం చాలానే కష్టపడ్డట్లు తెలుస్తోంది. ఇక తాజాగా అమ్మడు తన స్లిమ్ లుక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  దాదాపు ఆరు కేజీల వరకు బరువు తగ్గి నాజూకుగా కనిపించింది.

ఇక ఈ ఫోటోలను షేర్ చేయడంతో పాటు ఎలా బరువు తగ్గిందో కూడా వెల్లడించింది. ” బరువు తగ్గాలంటే కొవ్వు తగ్గించుకొనే సర్జరీలు చేయించుకోవాలని చాలామంది చెప్తుంటారు. అలాంటివేమీ అవసరం లేదు. డైట్ కంట్రోల్ చేస్తూ.. వాకింగ్, వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. ఐదు నెలల కఠోర శ్రమ తరువాత ఈ స్మార్ట్ లుక్ లభించింది. ఇప్పటివరకు ఆరుకేజిలు తగ్గాను. త్వరలోనే మునుపటి రూపం లో కనిపిస్తాను” అంటూ చెప్పుకొచ్బింది . ఇక ఈ లుక్ పై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మీరు ఎలా ఉన్నా అందంగానే ఉంటారు అని కొందరు అంటుండగా.. మరికొంతమంది.. చాలా కష్టపడ్డారు.. ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం నిత్యా పవన్ సరసన భీమ్లా నాయక్ లో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది.

Exit mobile version