యంగ్ హీరో నితిన్ చెక్, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం సినిమాలతో… గత రెండేళ్లుగా యంగ్ హీరో నితిన్ ఫ్లాప్స్ ఇస్తూనే ఉన్నాడు. మధ్యలో రంగ్ దే కాస్త పర్వాలేదనిపించింది కానీ సాలిడ్ హిట్ గా నిలబడలేదు. ఈసారి మాత్రం యావరేజ్ కాదు హిట్ కొట్టాల్సిందే అంటూ ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకోని ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు నితిన్. భీష్మ సినిమాలో బాగా నవ్వించిన నితిన్… ఈసారి ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాతో కూడా నవ్వించడానికి ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఎన్నో హిట్ సినిమాలకి రైటర్ గా కథలు అందించి ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ, నితిన్ ని ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ చేసేసాడు.
2022 ఏప్రిల్ లోనే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చింది. టీజర్, ట్రైలర్ తో పాజిటివ్ వైబ్ జనరేట్ చేసిన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాకి షోస్ ఆల్రెడీ కొన్ని సెంటర్స్ లో పడిపోయాయి. సోషల్ మీడియాలో ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమా గురించి మిక్స్డ్ రివ్యూస్ కనిపిస్తున్నాయి. కొందరు కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది అని ట్వీట్స్ చేస్తుంటే… మరికొందరు మాత్రం యావరేజ్ అంటున్నారు. ‘పవిత్ర సీన్’కి థియేటర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చినట్లు ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే విషయం వైరల్ అవుతోంది. నితిన్, శ్రీలీల కలిసి చిరు సాంగ్ కి డాన్స్ వేసిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఓవరాల్ గా ఫుల్ రివ్యూ బయటకి వచ్చే వరకూ సోషల్ మీడియాలో పబ్లిక్ పల్స్ ని చూస్తే మాత్రం నితిన్ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాతో యావరేజ్ మూవీనే చేసినట్లు ఉన్నాడు. మరి కామెడీ వర్కౌట్ అయ్యి అన్ని సెంటర్స్ నుంచి టాక్ బయటకి వస్తే ఎలా ఉంటుందో చూడాలి.