Site icon NTV Telugu

Nithin : మహేశ్, పవన్ నుంచి అవి దొంగిలిస్తా.. నితిన్ షాకింగ్ కామెంట్స్

Nithin

Nithin

Nithin : యంగ్ హీరో నితిన్ తాజాగా రాబిన్ హుడ్ మూవీతో రాబోతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని నితిన్ పట్టుదలతో ఉన్నాడు. శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్లు పెంచేశారు. అయితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో నితిన్ కు యాంకర్ కొన్ని ప్రశ్నలు వేసింది. టాలీవుడ్ హీరోల ఫొటోలు చూపిస్తూ వీరి నుంచి ఏం దొంగిలిస్తారు అని అడిగింది.

Read Also : HUDCO-CRDA: హడ్కో-సీఆర్‌డీఏఎం మధ్య ఒప్పందం.. రాజధాని నిర్మాణాలకు 11 వేల కోట్లు!

నితిన్ ఒక్కొక్క హీరో గురించి ఒక్కొక్కటి చెప్పుకొచ్చాడు. ప్రభాస్ నుంచి వ్యక్తిత్వం, విజయ్ దేవరకొండ నుంచి రౌడీ క్యారెక్టర్, బన్నీ నుంచి డ్యాన్స్, మహేశ్ బాబు నుంచి అందం, పవన్ కల్యాణ్‌ నుంచి అన్నీ దొంగిలిస్తానని చెప్పుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి డైలాగ్ డెలివరీ, నాని నుంచి ఈగ మూవీ దొంగిలించాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు. అటు శ్రీలీల్ కూడా కాజల్ నుంచి కళ్లు, అనుష్క నుంచి హైట్ తీసుకోవాలని ఉందంటూ సరదాగా బదులిచ్చింది.

Exit mobile version