Site icon NTV Telugu

Nithiin : నితిన్ గట్టెక్కేనా?

Nithiin, Vi Anand, No Body No Rules

Nithiin, Vi Anand, No Body No Rules

యువ హీరో నితిన్‌కు ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ అవసరం, ‘భీష్మ’ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నితిన్‌కు కాలం కలిసిరావడం లేదు. వరుసగా ఏడు పరాజయాలు ఆయన మార్కెట్‌ను బాగా దెబ్బతీశాయి. ఇటీవలే విడుదలైన ‘తమ్ముడు’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్నే మిగిల్చింది, ఈ డిజాస్టర్ తర్వాత తన తదుపరి అడుగు విషయంలో నితిన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు ఏడు నెలల నిరీక్షణకు తెరదించుతూ, ఎట్టకేలకు తన కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్, ఈసారి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించే టెక్నికల్ డైరెక్టర్ వి.ఐ. ఆనంద్‌ను నమ్ముకున్నారు, వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్రకటన రావడంతో అభిమానుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. వి.ఐ. ఆనంద్ గతంలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి విభిన్నమైన కథాంశాలతో మెప్పించిన దర్శకుడు కావడం విశేషం.

Also Read :Rajendra Prasad : శ్రీ లీల నోటి మహిమ.. రాజేంద్రప్రసాద్’కి పద్మ శ్రీ

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఇందులో నితిన్ సిగార్ తాగుతూ, గడ్డంతో చాలా రఫ్ అండ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు, నితిన్ కెరీర్‌లో ఇప్పటివరకు చూడని కొత్త మేకోవర్‌గా దీన్ని చెప్పవచ్చు. ఈ లుక్ చూస్తుంటే ఈసారి నితిన్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది. నితిన్ కెరీర్‌లో ప్రస్తుతం ఒక క్లిష్ట పరిస్థితి నెలకొంది, వరుసగా ఏడు ఫ్లాపులు పడటం అనేది ఏ హీరోకైనా పెద్ద మైనస్సే. అందుకే ఈసారి ఎక్స్ ప్రెషన్స్ కంటే టెక్నికల్ వాల్యూస్ మరియు కథపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు, వి.ఐ. ఆనంద్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యి నితిన్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో లేదో వేచి చూడాలి.

Exit mobile version