Nindu Noorella Saavaasam Special Episode in Zee Telugu: ఆసక్తికరమైన మలుపులు, ఆకట్టుకునే కథలతో సాగే సీరియల్స్ తో వినోదం పంచుతున్న జీ తెలుగు ఛానల్ తాజాగా పిఠాపురం వేదికగా అభిమానులకు అద్భుత అవకాశాన్ని అందించింది. అశేష ప్రేక్షకాదరణ పొందుతున్న జీ తెలుగు సీరియల్స్ ప్రేమ ఎంత మధురం, నిండు నూరేళ్ల సావాసం నటీనటులు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ఆదివారం జీ తెలుగులో ప్రసారం కానుంది. ప్రముఖ యాంకర్ శ్యామల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులకు వినోదం పంచింది.
జీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న’నిండు నూరేళ్ల సావాసం’, ‘ప్రేమ ఎంత మధురం’నటీనటులు ఈ వేదికపై నుంచి తమఅభిమానులతో సంభాషించడమే కాకుండా పలు బహుమతులను కూడా పంచి వారి సంతోషంలో పాలుపంచుకున్నారు. ఈ రెండు సీరియల్స్లో తమ నటనతో అలరిస్తున్న బాలనటుల ప్రదర్శనలు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నాయి. ప్రేమఎంతమధురంకథానాయకుడుశ్రీరామ్వెంకట్ (ఆర్యవర్ధన్) ఈ కార్యక్రమం ద్వారా తన అభిమానులను పలకరించి మరింత ఉత్సాహాన్ని జోడించారు. అంతేకాదు ఈ సీరియల్ నుంచి వర్ష (అను), మహేశ్వరి (మాన్సీ), కరమ్ (నీరజ్) కూడా పాల్గొని అభిమానులను అలరించారు. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నటీనటులు రిచర్డ్ జోస్ (అమరేంద్ర), పల్లవి గౌడ (అరుంధతి), నిసర్గ గౌడ (భాగమతి), నవ్యరావు (మనోహరి)తో పాటు పిల్లలు కూడా పాల్గొని తమ అద్భుత ప్రదర్శనలతో మరచిపోలేని అనుభూతులను పంచారు.