స్టార్ హీరోయిన్ ఇంట్లో దొంగతనం.. ధనుష్ పై పోలీసులకు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నిక్కీ గల్రానీ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆమె ఇంట్లో విలువైన దుస్తులు, కెమెరా కనిపించడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో పనిచేసే ధనుష్ పై అనుమానం ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. గత కొన్ని రోజుల క్రితం ధనుష్ అనే యువకుడు తమ ఇంట్లో పనికి కుదిరాడని, ఎప్పుడైతే దుస్తులు, కెమెరా చోరీ అయ్యాయో అప్పటినుంచి అతను కనిపించడం లేదని తెలిపింది. వాటి విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని, అందుకే ధనుష్ పై తనకు అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఇక నిక్కీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ధనుష్ కోసం రెండు రోజులు గాలించి తాజాగా అతడి స్నేహితుడి ఇంట్లో పట్టుకున్నారు.
ధనుష్ ని తమదైన రీతిలో విచారించగా.. తానే ఆ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆ దుస్తులను, కెమెరాను స్నేహితుడి ఇంట్లో దాచానని చెప్పగా.. పోలీసులు వాటిని వెతికి, నిక్కీకి అప్పగించారు. దీంతో నిక్కీ వెంటనే అతనిపై కేసును విరమించుకున్నట్లు తెలుస్తోంది. కఠిన శిక్షలేమి వద్దని కోరుతూ అతడిని విడిపెట్టమని కోరినట్లు సమాచారం. నిక్కీ గల్రానీ తెలుగులోనూ సుపరిచితురాలే.. ఆది పినిశెట్టి నటించిన ‘మలుపు’, ‘మరకతమణి’ చిత్రాలలో నటించి మెప్పించింది. మరుముఖ్యంగా ఆమె నటి సంజన గల్రానీ చెల్లెలు అన్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కోలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తుంది.
Also Read
- Peddi Controversy : 'పెద్ది' ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్... ఏమన్నారంటే?
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
తాజావార్తలు
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!