పూజా కార్యక్రమాలతో మొదలైన నిఖిల్ కొత్త సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో 19వ చిత్రాన్ని ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ (‘గూఢచారి, ఎవరు, హిట్’) డైరెక్ట్ చేయబోతున్నాడు. రెడ్ సినిమాస్ పతాకంపై కె. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ తేజ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాతలు శరత్ మరార్, జెమినీ కిరణ్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. వారి చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందించారు. సినిమా సక్సెస్ అవ్వాలని విషెస్ తెలిపారు.
Also Read
ఈ సినిమా ముహుర్తం షాట్‌కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించగా, నిర్మాత రాజశేఖర్ రెడ్డి క్లాప్ కొట్టారు. ఆయన కుమార్తె, కొడుకు ఈశన్వి, ధృవ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. నిఖిల్ మొదటిసారి ఈ సినిమాలో గూఢచారి పాత్రను పోషించబోతున్నాడు. డైరెక్టర్ గ్యారీ బీహెచ్ స్వతహాగా ఎడిటర్ కావడంతో ఈ సినిమాకు ఎడిటింగ్ బాధ్యతలను అతనే తీసుకున్నాడు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ కాగా, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు. అనిరుధ్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి రచయిత. అర్జున్ సురిశెట్టి ఆర్ట్ డైరెక్టర్‌గా, రవి ఆంటోని ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!