Nikhil Siddharth’s The India House: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ తన తదుపరి సినిమాలను పాన్ ఇండియా లేవల్లోనే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం అతని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి స్వయంభు.. రెండు కార్తికేయ 3.. మూడు ది ఇండియా హౌస్. స్వయంభు శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేసే పని లో ఉండగా.. కార్తికేయ 3 ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక తాజాగా ది ఇండియన్ హౌస్ ను నిఖిల్ పట్టాలెక్కించాడు. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మాణ సంస్థ వి మెగా పిక్చర్స్ తో కలిసి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read: Abhay Verma: నేను అబ్బాయిని అని చెప్పినా.. కుర్రాళ్లు వదల్లేదు: హీరో
తాజాగా ఈ మూవీ షూటింగ్ జులై 1వ తేదీన హంపిలోని విరూపాక్ష ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఆ శివుని ఆశీస్సులతో షూటింగ్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ చిత్రం బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను 1905లో జరిగిన పీరియాడిక్ కథాచిత్రంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిఖిల్ స్వయంభు చిత్రంతో పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక అటుఇటుగా ఈ సినిమా కూడా అలానే ఉండబోతుందని టాక్. మరి ఈ సినిమాలతో నిఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో వేచి చుడాలిసిందే.