నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పేజెస్. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ‘కుమారి 21 ఎఫ్’ వంటి హిట్ తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ తీస్తున్న సినిమా ఇది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా డబ్బింగ్ కూడా మొదలైంది. నిఖిల్ సిద్ధార్థ్ డబ్బింగ్ చెబుతున్నారు. ఓ వైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతున్నాయి. వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.