కార్తికేయ 2 లాంటి రీ సౌండింగ్ హిట్ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన సినిమా ’18 పేజస్’. సుకుమార్ రైటింగ్స్, గీత ఆర్ట్స్ కలిసి నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి వచ్చింది. రవితేజ నటించిన ధమాకా మూవీ మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంటే, క్లాస్ కథతో థియేటర్స్ లోకి వచ్చిన నిఖిల్ థ్రిల్లింగ్ హిట్ కొట్టాడు. బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి, బయ్యర్స్ కి ప్రాఫిట్స్ ఇచ్చిన 18 పేజస్ సినిమా థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యింది. పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఒటీటీలో స్ట్రీమ్ అవ్వడానికి రెడీ అయ్యింది. జనవరి 27 నుంచి తెలుగు ఒటీటీ ‘ఆహా’లో 18 పేజస్ స్ట్రీమ్ అవ్వనుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ‘ఆహా’ వాళ్లు 18 పేజస్ మూవీ స్పెషల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
మాములుగా థియేటర్స్ కోసం కట్ చేసిన ట్రైలర్ నే ఒటీటీకి వాడుతూ ఉంటారు కానీ 18 పేజస్ విషయంలో అలా చెయ్యకుండా ఆహా వాళ్లు ’18 పేజస్ ఆహా కట్ ట్రైలర్’ అని కొత్త ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ఫీల్ గుడ్ మూవీకి వచ్చిన రీవ్యూస్ మరియు సినిమాలోని ఇంపార్టెంట్ సీన్స్ ని కలిపి కట్ చేసిన ట్రైలర్ చాలా బాగుంది. ఒరిజినల్ ట్రైలర్ కన్నా ఆహా కట్ ట్రైలర్ బాగుంది. గోపి సుందర్ ఇచ్చిన మ్యూజిక్ 18 పేజస్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. పాన్ హిట్ కొట్టిన తర్వాత ప్యూర్ లవ్ స్టొరీ చెయ్యడానికి చాలా గట్స్ కావాలి, నిఖిల్ కథని నమ్మి 18 పేజస్ సినిమా చేశాడు. నిఖిల్, అనుపమలని హిట్ పెయిర్ గా మార్చిన 18 పేజస్ మూవీని జనవరి 27న ఆహాలో చూసి ఎంజాయ్ చెయ్యండి.