Niharika NM: యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ దాకా.. నిహారిక ఎన్‌ఎం సక్సెస్ స్టోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా ద్వారా కోట్లాది అభిమానులను సంపాదించిన ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్‌ఎం, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెడుతోంది. ‘మిత్ర మండలి’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమె, తన డెబ్యూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రానికి విజయేందర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి నిహారిక హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడింది.
Also Read : Nagarjuna : నాగార్జున 100వ సినిమాలో నిన్నే పెళ్లాడతా’ జంట మళ్లీ కలుస్తుందా?..
Also Read
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
- Kabir Duhan Singh: 'హనుమాన్ అంశ్' బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
“నటిగా నేను ఒప్పుకున్న మొదటి సినిమా ‘మిత్ర మండలి’నే. కానీ దీని షూటింగ్ షెడ్యూల్ డేట్స్ కారణంగా కొంచం ఆలస్యమైంది. ఈలోగా నేను చేసిన తమిళ సినిమా ‘పెరుసు’ ముందే రిలీజ్ అయింది. అదృష్టవశాత్తూ ఆ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు మా సినిమా ‘మిత్ర మండలి’..మూవీ ‘మ్యాడ్’, ‘జాతిరత్నాలు’ తరహా ఫన్ ఎంటర్టైనర్. కథ, పాత్రలు, కామెడీ అన్నీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రియదర్శి, రాగ్‌మయూర్, విష్ణు లాంటి అద్భుత నటులు ఇందులో ఉన్నారు. షూటింగ్ సమయంలో ప్రియదర్శి ‘కోర్ట్’ సినిమా హిట్ అయినా, ఆయన ఎంత సింపుల్‌గా ఉంటారో చూసి ఇంప్రెస్ అయ్యా” అని చెప్పింది.
అదే సమయంలో తన సోషల్ మీడియా జర్నీ గురించి కూడా నిహారిక ఎమోషనల్‌గా షేర్ చేసింది. “కాలేజీ రోజులల్లో టైమ్‌పాస్ కోసం యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశా. రెండేళ్లపాటు ఒక్క పైసా రాలేదు. అప్పట్లో మా అమ్మానాన్న ‘హాబీగా వీడియోలు చెయ్యి గానీ, దీన్నే కెరీర్‌గా ఎంచుకుంటే కాళ్లు విరగ్గొడతాం’ అనేవారు. ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా నుంచి ఇన్‌కమ్ అనే విషయం ఎవరికీ తెలియదు. కానీ నేటికి అదే ప్లాట్‌ఫామ్ నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే “సినీ ఇండస్ట్రీ గురించి బయట చాలా తప్పుగా మాట్లాడుతుంటారు. కానీ మనం మన హద్దుల్లో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నాకు డార్క్ హ్యూమర్ అంటే ఇష్టం. ఏ పాత్ర చేసినా మా ఫ్యామిలీ కూడా హాయిగా చూసుకునేలా ఉండాలనుకుంటా. తెరపై నా సీన్స్ వస్తే వాళ్లు కళ్లు మూసుకోవాల్సిన పరిస్థితి రావద్దు,” అంటూ తన విలువలను పంచుకుంది.
తాజావార్తలు
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!