మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సీరీస్ ‘డెడ్ పిక్సెల్స్’. మే 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానున్న ఈ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో నిహారిక కొణిదెల ఫుల్ బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నిహారిక కొణిదెల, తనపై వచ్చిన రూమర్స్ పై స్పందించింది. ‘‘సోషల్‌మీడియాలో వచ్చే కామెంట్స్ వల్ల మొదట్లో బాధపడిన సందర్భాలున్నాయి. అక్కడ కొంతమంది మర్యాద లేనట్లు వ్యవహరిస్తారు. అందుకే రాను రాను ఆన్‌లైన్‌లో వచ్చే కామెంట్స్‌ను పట్టించుకోవడం మానేశా. ముఖ్యంగా యూట్యూబ్‌లో వచ్చే కామెంట్స్‌ను చూడను. ‘సైరా’ సమయంలో నాపై వచ్చిన మీమ్స్ చూసి బాగా నవ్వుకున్నాను. ‘పుష్ప’లో నేను నటిస్తున్నాననే వార్తల్లో నిజం లేదు’’ అని ఆమె వివరించారు. అనంతరం తన సోదరుడు రామ్‌చరణ్ ఐపీఎల్‌లో ఒక టీమ్‌ను కొనుగోలు చేస్తున్నారంటూ వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.. ‘‘అవునా.. ఏ టీమ్ కొంటున్నారు? హైదరాబాద్ టీమ్ కొంటున్నారా? ఏమో మరి నా వరకూ ఈ వార్త రాలేదు. ఈ ఇంటర్వ్యూ అయ్యాక అన్నయ్యను అడుగుతా’’ అని నిహారిక సమాధానం ఇచ్చింది.
ఇక ఫిల్మ్ కెరీర్ గురించి మాట్లాడుతూ… నిడివితో సంబంధం లేకుండా క్యారెక్టర్ నచ్చితే చాలు సినిమా చేస్తాను అని చెప్పిన నిహారిక కొణిదెల, సినిమా అవకాశాలు వస్తే తాను తప్పకుండా ఓకే చేస్తాను అని క్లియర్ గా చెప్పింది. మరి ఈ ఇంటర్వ్యూ తర్వాత అయినా నిహారిక “తక్కువ నిడివి ఉన్న పత్రాలు చెయ్యదు” అనే మాట ఆగిపోయి మంచి పాత్రలని ఆమె వరకూ తీసుకోని వెళ్తారేమో చూడాలి.