Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా అన్న పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. అందుకు కారణం ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడమే. మూడేళ్ల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా చైతన్య జొన్నలగడ్డను వివాహమాడింది నిహారిక. రెండేళ్లు అన్యోన్యంగానే ఉన్న ఈ జంట విభేదాలు కారణంగా ఈ మధ్యనే విడిపోయారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అప్పటినుంచి నిహారిక పేరు నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం ఆమె నటిగా, నిర్మాతగా కొనసాగుతుంది. ఈ మధ్యనే డెడ్ ఫిక్సల్స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సిరీస్ లో ఆమె మాట్లాడిన బోల్డ్ డైలాగ్స్ ఎంతటి సంచలనం సృష్టించయో అందరికి తెల్సిందే. ఇకపోతే ప్రస్తుతం నిహారిక మరో వెబ్ సిరిస్ ను ప్రొడ్యూస్ చేస్తోంది.
ఇక నేడు రక్షాబంధన్ సందర్భంగా ఆమె తన అన్నలకు రాఖీ కడుతున్న ఫొటోస్ ను, వీడియోస్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసింది. తన అన్నలు వరుణ్, చరణ్ లతో పాటు మరో అన్నకు కూడా రాఖీ కడుతున్న వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. “ఈ రాఖీ నాకు చాలా స్పెషల్.. ఒక బ్రదర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇంకో బ్రదర్ ఈ మధ్యనే తండ్రి అయ్యాడు. మరో బ్రదర్ ఐదేళ్ల తర్వాత ఇండియా వచ్చాడు.. ఆల్ లవ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.