Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనస్సు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినా అవి కూడా ఏమంత ప్రయోజనకరంగా అనిపించకపోవడంతో ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి.. పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకొని చైతన్య జొన్నలగడ్డతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇక వివాహ బంధంలో కి అడుగుపెట్టాకా కొత్త వ్యాపారం కూడా మొదలుపెట్టింది. అదే నిర్మాణ రంగం. ఒక నిర్మాతగా నిహారిక.. రెండు వెబ్ సిరీస్ లు తీసి మంచి హిట్స్ నే అందుకుంది. దీంతో ఆమె భవిష్యత్తులో నిర్మాతగా స్థిరపడుతోంది అని చెప్పొచ్చు.
ఇక నిహారిక జీవితంలో వివాదాలకు కొదువ లేదు. వాటిని పక్కన పెడితే.. ఆమె నిత్యం జోష్ ఫుల్ గా ఉంటూ పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే నిహారిక తాజాగా కొత్త ఫోటోషూట్ తో కిక్కెక్కించింది. అచ్చ తెలుగు ఆడపిల్లలా దర్శనమిచ్చింది. ఎరుపు లంగావోణీ, ముక్కుకు ముక్కెర, కర్లీ హెయిర్ తో వేసిన జడ.. ఆకట్టుకుంటున్నాయి. నిజం చెప్పాలంటే ఒక హీరోయిన్ కు కావాల్సిన అన్ని లక్షణాలు నిహారికలో ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ ఫోటోలను నిహారిక షేర్ చేస్తూ రెట్రో లుక్ అంటూ క్యాప్షన్ పుట్టుకొచ్చింది. ప్రస్తుత, ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ మధ్య కాలంలో నిహారిక గురించిన రూమర్స్ గట్టిగా వినపడుతున్న విషయం తెల్సిందే. వాటిని పట్టించుకోకుండా.. ఇలా ఫోటోషూట్ చేసింది అంటే అవన్నీ రూమర్స్ అని చెప్పినట్లే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు నిహారిక సినిమాను ఏమైనా నిర్మిస్తుందో లేదో చూడాలి.