Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం నటిగా నిలబడడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ గా నిహారికకు మంచి గుర్తింపు ఉంది. ఒక మనసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక.. సినిమాలు అయితే చేసింది కానీ, ఆశించిన ఫలితాలను మాత్రం అందుకోలేకపోయింది. దీంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. ఇక పెళ్లి తరువాత నటిగా కాకుండా నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు నిర్మించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక మూడేళ్లు కూడా కాకముందే విబేధాల కారణంగా భర్తకు విడాకులు ఇచ్చి.. మళ్లీ తండ్రి ఇంటికి చేరింది. అప్పటినుంచి ఈ ముద్దుగుమ్మ నటనవైపు దృష్టి సారించింది. ఫిట్ నెస్ మీద ఫోకస్ చేసి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఫోటోషూట్స్ తో పిచ్చెక్కిస్తోంది. ఒకపక్క నిర్మాతగా ఉంటూనే.. ఇంకోపక్క నటిగా కూడా తనవంతు ప్రయత్నం తాను చేస్తోంది.
ఇక తాజాగా నిహారిక.. మంచు మనోజ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. మంచు మనోజ్ రీఎంట్రీ ఇస్తున్న చిత్రం వాట్ ది ఫిష్. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 6ix సినిమాస్ బ్యానర్పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. నేడు నిహారిక పుట్టినరోజు కావడంతో.. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నిహారిక అల్ట్రా మోడ్రన్ సురేష్ లో అదిరిపోయింది. సిల్వర్ కలర్ గ్లిట్టర్ డ్రెస్ లో ఆమె ఎంతో అందంగా కనిపించింది. మంచు మనోజ్ సినిమాలో నిహారిక ఇలాంటి ఒక పాత్ర చేస్తుంది అని ఎవరు ఊహించలేదు. మరి ఈ సినిమాతో నిహారిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.