నిహారిక, చైతన్యల పెళ్ళి జరిగి ఎక్కువ కాలం కాలేదు.. కానీ, అప్పుడే వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని, ఇద్దరు దూరంగా ఉంటున్నారని ఆమధ్య వార్తలు వచ్చాయి. వీరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు పెద్దలు ఎంత ప్రయత్నించినా.. సఫలం కాలేదని ప్రచారం జోరుగా సాగింది. ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ గానీ, వారి సన్నిహితులు గానీ స్పందించకపోవడంతో.. నిహారిక, చైతన్యల మధ్య నిజంగానే విభేదాలున్నాయేమోనని అంతా అనుకున్నారు. ఇక ఇటీవల ఓ నైట్ పార్టీలో నిహారిక అరెస్ట్ అవ్వడం, దానిపై చైతన్య నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. వీళ్ళిద్దరు విడిపోయారని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యమంటూ కథనాలు వచ్చాయి.
కానీ, ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదంటూ కేవలం ఒకే ఒక్క ఫోటోతో నిహారిక క్లారిటీ ఇచ్చేసింది. కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటోన్న ఈ మెగా డాటర్, తాజాగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోల్ని షేర్ చేసింది. వాటిల్లో ఒక లిప్‌లాక్ ఫోటో కూడా ఉంది. దీంతో.. వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, సంతోషంగా తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారని స్పష్టమైపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇదిలావుండగా.. నిహారిక ఇటీవలే ఒక సినిమాని ప్రారంభించింది. ప్రముఖ ఓటీటీ సంస్థతో కలిసి, ఆమె ఈ సినిమాని నిర్మిస్తోందని సమాచారం.