Raid At Pudding & Mink Pub : రాత్రి నుంచి స్టేషన్ లోనే నిహారిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో ఇటీవల భారీగా డ్రగ్స్ కార్యకలాపాలు సాగుతున్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో మరో భారీ రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడి చేసి యజమానితో సహా 150 మందిని అరెస్టు చేశారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉండడం హాట్ టాపిక్‌గా మారింది. పబ్‌లో జరిగిన పార్టీలో వీరంతా డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన వారందరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున 3 గంటల వరకు పబ్ నిర్వహించిన పబ్ యజమానిని సైతం అదుపులోకి తీసుకున్నారు. కాగా విచారణ అనంతరం కొందరిని విడుదల చేయగా, ప్రస్తుతం 38 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే తమను అరెస్ట్ చేశారంటూ పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు పబ్ లో డ్రగ్స్ వాడినట్టు కూడా వెల్లడైంది.
Read Also : Galla Ashok : పబ్ వివాదంతో సంబంధం లేదు !
Also Read
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
ఇదిలా ఉండగా ఈ వివాదంలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఉండడం సంచలనానికి దారి తీసింది. పుడ్డింగ్ అండ్ మింగ్ పబ్ లో రాత్రి జరిగిన పార్టీలో నిహారిక కూడా పాల్గొంది. అయితే రాత్రే వీరందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక అప్పటి నుంచి నిహారిక అక్కడే ఉన్నట్టు సమాచారం. ఆ తరువాత పేరెంట్స్ ని పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చి కొందరిని విడుదల చేశారు. ఈరోజు మధ్యాహ్నం నిహారిక పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. పట్టుబడిన వారిలో సినీ, రాజకీయ, పారిశ్రామికవేత్తల పిల్లలు ఉండగా, అందులో కొందరి వద్ద నుంచి కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!