Niaharika Konidela: నా క్యారెక్టర్ ని తప్పుబట్టారు.. భర్తతో విడాకులపై మొదటిసారి స్పందించిన నిహారిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niaharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ నిహారిక. ఒక మనసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆలోపే చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహాన్ని పెద్దలు నిశ్చయించడంతో 2020 లో వీరి వివాహం జైపూర్ లో గ్రాండ్ గా జరిగింది. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్ధం చేసుకోని బతకడం. అది ఈ జంట వలన కాలేకపోయింది. విబేధాల వలన ఈ జంట గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల తరువాత నిహారిక.. కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఫుడ్, ట్రావెల్, ఫిట్ నెస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తూ తన గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే నటిగా, నిర్మాతగా కొత్త అవతారాలు ఎత్తుతూ సక్సెస్ కోసం కష్టపడుతుంది. ఇప్పటివరకు విడాకుల గురించి మాట్లాడని నిహారిక ఒక పాడ్ కాస్ట్ లో భర్తతో విడాకులపై మొదటిసారి నోరు విప్పింది.
” పెళ్లి తరువాత నటనను వదిలేస్తారా.. ? అని అడుగుతారు. ఈ మధ్య మా వదిన లావణ్యను కూడా అదే అడిగారు. పెళ్లి తరువాత నటనను ఎందుకు వదిలేస్తాం. అదే మా వృత్తి. ఖచ్చితంగా నటిస్తాం. నిర్మాతగా మారడం వలన నటనకు కొద్దిగా గ్యాప్ ఇచ్చాను. అయితే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునేముందు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి. అది జరుగకపోతే మనకు సెట్ అవని వ్యక్తిపై ఆధారపడకూడదు. ఎందుకంటే వాళ్లు మన ఇంట్లో అమ్మానాన్నలా ఉండరు కదా.. ముఖ్యంగా అంత ప్రేమగా అస్సలు చూసుకోలేరు. అందుకే ఎవరి మీదా ఆధారపడకుండా ఒంటరిగా ఉండడం నేర్చుకున్నాను. నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. విడాకులు తీసుకున్న సమయంలో నన్ను చాలా మాటలు అన్నారు.ఆ బాధ తట్టుకోలేక ఎంతో ఏడ్చాను. అలాంటి వాటిని భరించడం అంత ఈజీ కాదు. ఎవరైనా జీవితంలో కలిసి ఉండాలనే పెళ్లి చేసుకుంటారు.
Also Read
- Peddi Breakeven Target : రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
- Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ 'బ్లాస్ట్'
- Buchi Babu: "నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా".. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
- Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
ఒక ఏడాదిలో విడిపోతామని తెలిసి అంత డబ్బు ఖర్చుపెట్టి ఎవరు పెళ్లి చేసుకోరు కదా. నేను కూడా అలాగే పెళ్లి చేసుకున్నాను.. కానీ, మా ఇద్దరికి సెట్ అవ్వలేదు. కలిసి ఉండాలనే నేను కోరుకున్నాను.. మనం అనుకున్నవే జరగాలని లేదు. విడాకుల తరువాత నా గురించి చాలా రాసుకొచ్చారు. నేను వాటిని అస్సలు పట్టించుకోలేదు. కానీ, నా క్యారెక్టర్ ని తప్పుబట్టారు.. నా కుటుంబాన్ని దూషించారు.. అప్పుడు నేను అస్సలు తట్టుకోలేకపోయాను. కానీ, నా కుటుంబం నన్ను ఎప్పుడు బరువనుకోలేదు. ఈ రెండేళ్లలో కుటుంబం విలువ ఏంటో తెలిసింది. పెళ్లి-విడాకుల తర్వాత ఎవర్నీ నమ్మకూడదని అర్దమైంది. ఇదొక గుణపాఠం. నేను ఎప్పటికీ సింగిల్ గా ఉండాలనుకోవడం లేదు.. నా వయస్సు 30 మాత్రమే.. మంచి వ్యక్తి ఎదురుపడితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
-
CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
-
Lalit Modi: ‘ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు’, సుష్మితా సేన్‌తో తన బ్రేకప్‌పై మౌనం వీడిన లలిత్ మోడీ..
-
Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
-
TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!