సిద్ధూ జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ సినిమాని ఏ టైంలో అనౌన్స్ చేశాడో తెలియదు కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి ఆరు నెలలు గడుస్తున్నా ఆ ‘డీజే’ సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. తెలుగు సినీ అభిమానులు ‘రాధిక’ అనే పేరుని,’డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ ని 2022 ఇయర్ మొత్తం రిపీట్ మోడ్ లో తలచుకోని ఉంటారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘డీజే టిల్లు’ సూపర్ హిట్ అయ్యి, ఒక క్రేజీ క్యారెక్టర్ ని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చింది. ఈ సూపర్ క్రేజీ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేస్తూ మేకర్స్, ‘డీజే టిల్లు స్క్వేర్’ని అనౌన్స్ చేశారు. ‘డీజే టిల్లు’ సినిమాకి సీక్వెల్ గా ‘డీజే టిల్లు స్క్వేర్’ సినిమా రూపొందుతుంది. ఇటివలే సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. డీజే టిల్లు అని పేరు పెట్టుకుంటే సరిపోతుందా, న్యూ ఇయర్ పార్టీ సాలిడ్ సౌండ్ చెయ్యాలి కదా. అందుకే 2023ని గ్రాండ్ గా స్టార్ట్ చేస్తూ, ‘డీజే టిల్లు స్క్వేర్’ వస్తున్నాడు అనే హింట్ ఇస్తూ మేకర్స్, ఈ మూవీ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
Tillanna wishes everyone a very Happy New Year! 🎇 #TilluSquare
Any new year parties please contact #TilluEvents 🥳🕺
‘Starboy’ #Siddu 🌟 @MallikRam99 @ram_miriyala @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/2uA4ojIcYs
— Sithara Entertainments (@SitharaEnts) December 31, 2022
ఏవైనా పార్టీలు ఉంటే ‘టిల్లు ఈవెంట్స్’ని కాంటాక్ట్ అవ్వండి అనే క్యాప్షన్ తో బయటకి వచ్చిన పోస్టర్ లో ‘సిద్ధూ జొన్నలగడ్డ’ మస్త్ ఉన్నాడు. ఆ క్యారెక్టర్ తన కోసమే పుట్టిందేమో, రియల్ లైఫ్ లో కూడా తను నిజంగానే ‘డీజే టిల్లు’ అనిపించేలా ఉన్నాడు సిద్ధూ జొన్నలగడ్డ. అయితే ఫస్ట్ పార్ట్ ని డైరెక్ట్ చేసిన ‘విమల్ కృష్ణ’ పార్ట్ 2 నుంచి తప్పుకోగా ‘అద్భుతం’, ‘నరుడా డోనరుడా’ లాంటి సినిమాలని రూపొందించిన ‘మల్లిక్ రామ్’ ఈ సీక్వెల్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. రామ్ మిర్యాల మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనేది బేతాళ ప్రశ్నగానే మిగిలింది. ఇప్పటివరకూ ‘డీజే టిల్లు స్క్వేర్’ నుంచి అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్, శ్రీలీలా… హీరోయిన్లుగా నటిస్తున్నారు అని ఆ తర్వాత తప్పుకున్నారు అని ఇలా చాలా రకాల వార్తలు వచ్చాయి కానీ అఫీషియల్ గా అన్ బోర్డ్ అయిన హీరోయిన్ ఎవరు అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ లిస్టులో ‘మీనాక్షి చౌదరి’ వచ్చి చేరింది. మరి ఈ ‘హిట్ 2’ హీరోయిన్ అయినా ‘డీజే టిల్లు స్క్వేర్’లో హీరోయిన్ గా ఉంటుందో లేదో చూడాలి.